రివ్యూ

గాండ్రించే ఓపిక లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బెంగాల్ టైగర్ (బాగోలేదు)

తారాగణం:
రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరానీ, రావు రమేష్, పృథ్వీ, పోసాని, బ్రహ్మానందం, షాయాజీ షిండే తదితరులు.
సంగీతం: భీమ్స్
నిర్మాత: నిర్మాత:
దర్శకత్వం:
సంపత్ నంది

విలన్స్‌ని చేతితో కొడతాడు -కాలితో కూడా తంతాడు. విలన్స్‌ని మైండ్‌గేమ్‌తో కొడతాడు. తన మైండ్ షార్ప్ చేసుకోడానికి తను జంగ్లీ రమీ ఆడతాడు -ఇదీ అసలు మూల కథ. దర్శకుడు తెలివిగా ‘ఇదొక రెగ్యులర్ ఫార్మేట్ సినిమా -బోలెడన్ని కమర్షియల్ ఎలిమెంట్స్’ అంటూ చెప్పటంతో సగటు ప్రేక్షకుడు కూడా ‘మైండ్ షార్ప్’ చేసుకొని -రవితేజతో రమీ ఆడటానికి సిద్ధపడతాడు. కమర్షియల్ కథల్లో లాజిక్‌ని వెతక్కూడదు. అంత బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు. వెర్రిమొహాలు వేసుకొని -ఆలోచనల్లో ఏదైనా ప్రశ్న మెదిలినా.. తూచ్ అని సర్ది చెప్పేసుకొని రొటీన్ కథని చూసేయటమే. కానీ -ఇది మరీ కమర్షియల్ రేంజ్‌ని కూడా దాటిపోయి.. రౌడీలు గాల్లో గింగిరాలు తిరిగినట్టు.. ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది.
మచ్చుకి నాలుగు మాటలు -ఎవడైనా ఫేమస్ కావాలంటే.. మంత్రిని రాయిచ్చుకొని కొట్టేయాలి. బర్త్‌డే పార్టీలో ‘షార్ప్ డైలాగ్‌లతో’ క్లాస్ పీకాలి. ఒక హీరోయిన్‌తో రొమాన్స్ కంటే.. ఇద్దరు నాయికలైతే బెటర్. బోలెడంత పాపులారిటీ. ఆత్రేయపురం పేరూ.. ఆ పురంలోని ఆకాష్ పేరూ ఇక మోతే. ‘రచ్చ’ చూసింత్తర్వాత.. ఆ మైకంలోంచి ఇంకా బయటపడక మునుపే.. మరో ‘రొటీన్’ కథతో వస్తున్నాడంటే.. ఎక్కడా సందేహం లేదు. కానీ మరీ పాత కథతో.. అర్థంలేని సీన్లతో వచ్చేశాడంటేనే డౌట్. -‘బెంగాల్ ‘వీక్’ టైగర్’ -వంద మందిని వొంటిచేత్తో కొట్టేశాడంటేనే మరీ సిల్లీ.
వీక్ కథేంటో చూద్దాం
ఆత్రేయపురంలో మోస్ట్ ఆవారా ఎవరయ్యా? అంటే -ఆకాష్ (రవితేజ). కమ్యూనిస్ట్ భావాలు కలిగిన, ఊరికి పెద్ద అండ జయనారాయణ్ (నాగినీడు) పుత్రరత్నం. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ చేసినా.. ఉద్యోగం సద్యోగం లేకుండా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకోవటం ఆకాష్ మనస్తత్వం. పెళ్లీడు వచ్చింది కాబట్టి ఇంట్లో పెళ్లి చేసేస్తామంటే -ఉన్నపళంగా పెళ్లిచూపులకు వెళ్లిన ఆకాష్‌కి ఎదురుదెబ్బ తగులుతుంది. చదువు -ఉద్యోగం ఉంటే సరిపోదు. ఏ విషయంలోనైనా ‘ఫేమస్’ అయితే చెప్పు, పెళ్లి చేసుకొంటానంటూ పెళ్లికూతురు ఆకాష్‌ని అవమానిస్తుంది. ‘ఫేమస్’ కావాలంటే ఎలా? అన్న పుస్తకాలూ గట్రా దొరకలేదు కాబట్టి -మంత్రిని రాయెట్టి కొట్టేస్తాడు. దాంతో మీడియా మొత్తం అతణ్ణి ఫోకస్ చేస్తుంది. లోకల్ పొలిటికల్ పార్టీ మీటింగ్‌ని చెడగొట్టి పోలీసుస్టేషన్‌కి వెళ్లి బోలెడంత ఫేమసైపోతాడు. ఆకాష్ ఫేమస్‌నీ.. అతగాడి ధైర్యాన్ని చూసి తెగ ముచ్చటపడిన హోం మినిస్టర్ నాగప్ప (రావు రమేష్) తన కూతురు శ్రద్ధ (రాశీఖన్నా)కి బాడీగార్డ్‌గా నియమిస్తాడు. కథ ఇంత సజావుగా నడుస్తూండగా -శ్రద్ధ ఆకాష్‌ని గాఢంగా ప్రేమిస్తుంది. నాగప్ప కూడా కూతురి ప్రేమని అంగీకరించి.. ఆకాష్‌కీ.. శ్రద్ధకీ పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకొంటూండగా.. తను శ్రద్ధని ప్రేమించలేదనీ.. సిఎం అశోక్ గజపతి (బొమన్ ఇరానీ) కూతురు మీర (తమన్నా)ని ప్రేమిస్తున్నానని అంటాడు. ట్విస్ట్ బాగుంది. దీంతో ప్రేక్షకుడిని ఎన్నో ఆలోచనలు వెంటాడుతాయి. హోం మినిస్టర్ కూతుర్ని కాదని.. సిఎం కూతుర్ని ప్రేమించాననటం వెనుక ఉన్న పరమార్థాన్ని తరచి చూస్తే -సెకండ్ హాఫ్‌లోనే కాదు.. సినిమా మొదలైన దగ్గర్నుండీ హీరో ‘ఆలోచన’ ఏమిటన్నది తెలిసిపోతుంది. ఇంతకుమించి కథని వెతుక్కుంటే అది ప్రేక్షకుడి తప్పు.
కథ అన్న ఔట్‌లైన్ గీసుకొని.. ఆ పరిధిలోనే కాసిన్ని కామెడీ సీన్లు.. ఫైట్స్.. రొమాన్స్.. మాస్ డైలాగ్స్‌తో -ఈక్వేషన్‌కి ఏమాత్రం తగ్గకుండా.. పొల్లుపోకుండా సినిమాని నడిపించిన సంపత్ నంది -అన్నీ తానై రచ్చరచ్చ చేశాడు. ఇదసలు రవితేజ సినిమా. కావల్సినంత వెటకారం. హీరో కాబట్టి -తలచిన వెంటనే అన్నీ జరిగిపోతూంటాయి, లాజిక్‌కి దొరక్కుండా. ‘ఫేమస్’ కావాలంటే మంత్రిని రాయిచ్చుకొని కొట్టేస్తే.. సెల్లోకి తోసి మక్కెలిరగతంతారన్న మన చిన్ననాటి కానె్సప్ట్‌ని ఉన్నపళంగా మార్చేసుకొని -‘ఫేమస్’కి ఇదీ దారి అని ఖరాఖండిగా నిర్ణయించేసుకోవటమే ఈ చిత్ర పరమావధి.
స్టెప్ బై స్టెప్ వేసుకొంటూ కథ అనే లెక్కని క్లైమాక్స్ చేర్చిన తీరు- ఆకట్టుకొంటుంది. ఎందుకంటే -ఆ పడికట్టు కథలకూ.. సన్నివేశాలకూ ప్రేక్షకుడు ‘్ఫక్స్’ అయిపోయాడు కాబట్టి. హీరో ఇంట్రడక్షన్ సీన్.. హీరోయిజాన్ని వెలగబెట్టాలి కనుక -సాదాసీదా విలన్ల జోలికి కాకండా -రాజకీయ నాయకుల జోలికి వెళ్లటం.. ఇద్దరు హీరోయిన్ల మధ్య హీరో చేసే రొమాన్స్.. మరోవైపు ఫ్యామిలీ డ్రామా -వీటికితోడు కామెడీ సీన్లు -వెరసి పధ్నాలుగు రీళ్ల సినిమా. రవితేజ మునుపటి వెటకారం జోష్ తగ్గినట్టు అనిపించటానికి -అతడి పర్సనాలిటీ కొద్దిగా తగ్గటమే. ఆ ఛార్మింగ్ మిస్సవటంతో ఇద్దరు హీరోయిన్లని ఎత్తుకొని స్టెప్స్ వేయటం ‘కామెడీ’గా చూడాల్సి వచ్చింది. ఐతే -ఈ సినిమాకి రంగు రుచి... అన్నీ రవితేజనే. ఒక్క ‘వీక్’ మైనస్ తప్ప కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమాకి సెకండ్ హాఫ్ మరో మైనస్. కథ ముందే తెలిసిపోతూంటే -ఏమంత మజా ఉండదు. రొటీన్ కథని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో చెప్పాలన్న తాపత్రయం కనిపించింది కానీ.. అది స్క్రీన్ మీదికి వచ్చేసరికి -చప్పగా సాగింది. సన్నివేశాలన్నీ రిచ్‌గా కనిపించటానికి సినిమాటోగ్రఫీ దోహదం చేసింది. అంటే ఒక మైనస్ ఒక ప్లస్. ఇలా సన్నివేశానికీ సన్నివేశానికీ మధ్య డోలాయమాన పరిస్థితి. ఆఖరికి రాశిఖన్నాతో ‘టూ పీస్’ వేయించినా -గుంపులో గోవిందలా అనిపించింది. ఏ కొద్దిమందికో ‘ఎడారిలో ఒయాసిస్సు’లా అనిపించి సేదతీరి ఉండొచ్చు.
తమన్నాకి ‘కోటింగ్’ ఎక్కువైనట్టు అనిపించింది. పాత్ర పరిధి తక్కువ. కొన్ని సీన్లలోనైనా -్ఫర్వాలేదనిపించింది. రాశిఖన్నా జస్ట్ ఓకే. రావు రమేష్, పృథ్వీ, పోసాని, బ్రహ్మానందం తదితరులు తమ పాత్రల పరిధిలో ‘్ఫక్స్’ అయ్యారు. అంతే!? మొత్తానికి ‘రవితేజ’ ఫ్లేవర్ అక్కడక్కడ కనిపిస్తుంది.

-ప్రనీల్