ఆంధ్రప్రదేశ్‌

ఎప్పుడూ ఇలా జరుగలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తనను ఎన్నాళ్లు గృహ నిర్బంధంలో ఉంచుతారో చూస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో తనను గృహ నిర్బంధంలో ఉంచటంపై ఆయన మీడియా ఎదుట స్పందించారు. చరిత్రలో ఎన్నడూ చూడలేదని, ఎప్పుడూ ఇలా జరుగలేదని విమర్శించారు. తమ పార్టీ నాయకులందరినీ గృహ నిర్బంధంలో ఉంచారని, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఒక పోలీసు స్టేషన్ నుంచి మరొక పోలీసు స్టేషన్‌కు తిప్పారని, తమ ఇంట్లోకి పనివాళ్లను కూడా రానివ్వలేదని అన్నారు. ఆత్మకూరులో 120 ఎస్సీ కుటుంబాలు శిబిరంలో ఉంటే వారికి భోజనాలు కూడా అందివ్వనీయకుండా చేశారని అన్నారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే ప్రసక్తిలేదని, ఇది కొనసాగుతుందని అన్నారు. 540 కుటుంబాలను వారి గ్రామాలకు తరలించే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.