బాల భూమి

రామాయణం క్విజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నలు:
1. హనుమంతుడు సీతను చూసి వచ్చానని చెప్పగానే రాముడు ఏమన్నాడు?
2. ఎటువంటి సేవకుడు ఉత్తముడు?
3. ఎవరు మధ్యముడు?
4. అధముడు అంటే ఎవరు?
5. హనుమ ఏ కోవకు చెందినవాడు?
జవాబులు:
1. రాముడు హనుమంతుడుని గాఢాలింగనము చేసుకుని, ‘ఇంతటి క్లేశమైన కార్యాన్ని మారుతి వంటి స్వామి సేవాపరాయణుడు తప్ప సాధించలేడు. వాయువో, వైనతేయుడో తప్ప సముద్రం ఆవలి తీరం చేరడం ఎవరికీ ఊహకందనిది. పైగా ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్న లంకానగరం అంతా తిరిగిరావడం ఎవ్వరూ చేయలేని పని’ అన్నాడు.
2. ప్రభువు ఆజ్ఞను సమయోచితంగా నిర్వర్తించి తృప్తి కలిగించే సేవకుడు ఉత్తముడు.
3. చెప్పినదాన్ని చెప్పినట్లు చేసేవాడు మధ్యముడు.
4. చెప్పిన మేరకు చెయ్యలేనివాడు అధముడు.
5. హనుమంతుడు ఉత్తమ శ్రేణికి చెందిన సేవకుడు. సీతానే్వషణలో సఫలుడై రఘువంశాన్ని నిలబెట్టాడని రాముడు ప్రశంసించి, హనుమను గాఢాలింగనం చేసుకుని, ‘ఇంతకంటే ఈ దూతకు నేను బహూకరించగలిగింది లేదు’ అన్నాడు.
*