రాష్ట్రీయం

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టుమార్టమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి:సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసు సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈరోజు రీ పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. చెంచుపేట స్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాం ఆనవాళ్లను ఫోరెన్సిక్ నిపుణులు నమోదు చేసుకున్నారు. కాగా అయేషా మీరా 2007లో విజయవాడలోని ఒక హాస్టల్‌లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా సత్యంబాబును అరెస్టు చేశారు. మహిళా సెషన్స్ కోర్టులో జరిగిన విచారణలో సత్యంబాబు దోషిగా తేలటంతో 14 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఎనిమిదేళ్ల జైలు జీవితం తరువాత సత్యంబాబు విడుదల అయ్యాడు. కాగా ఈ కేసును సీబీఐ విచారణకు నవంబర్ 29,2018 ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో జనవరి, 2019 నుంచి సీబీఐ విచారణ ప్రారంభించింది.