సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదేళ్ల నుంచండి’
‘ఆమెకి బంధువులు ఎవరైనా ఉన్నారా?’
‘నాకు తెలియదండి. నిజం చెప్పాలంటే ఆమె ముఖం నేనెప్పుడూ చూడలేదు. పొద్దున్న పాలు పట్టుకెళ్లి తలుపు కొడితే ఓ రెక్క తెరిచి గినె్న పెడుతుంది. పాలు పోసేక తనకి అవసరమైన సరుకుల చీటీ, డబ్బులు ఇస్తుంది. మర్నాడు పాలతోపాటు సరుకులు ఇస్తాను’ వివరించేడతను.
‘బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసేవాడివా?’
‘చేసేవాడినండి’
తలపంకించి అడిగేడు యుగంధర్.
‘ఆమె భర్తని ఎప్పుడైనా చూసావా?’
‘లేదండి. పదేళ్ల క్రితం ఒకరోజు పాలు పొయ్యడానికి ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు ముసుగు కప్పుకుని నన్ను పిలిచింది. రోజుకి అర లీటరు పాలు కావాలని అడిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా పాలు ఇస్తున్నాను’
‘ఇంట్లోకి ఎప్పుడూ వెళ్లలేదా?’
‘లేదండి’
‘ఆమె చనిపోయిందని నీకెలా తెలిసింది?’
‘పోలీసులు తలుపులు పగలగొట్టిన మర్నాడు’
‘అంతకు ముందు నీకు తెలియదా?’ అతని కళ్లల్లోకి చూస్తూ అడిగేడు యుగంధర్.
‘నాలుగైదు రోజుల నుండి ముందు గేటుకి తాళం వేసి ఉంటోంది. మామూలుగా నేను వెళ్లినప్పుడు తాళం ఉండదు. అందుచేత లోపలికి వెళ్లి తలుపు కొట్టేవాడిని. ఈ నాలుగు రోజుల నుంచి గేటుకి తాళం ఉండటంతో పాలు ఇవ్వకుండా వచ్చేస్తున్నాను. ఆమెకి ఇవ్వాల్సిన రిజిస్టర్ పోస్టు రసీదు, కొంత సొమ్ము నా దగ్గర ఉండిపోయాయి’ చెప్పాడతను.
‘రిజిస్టర్ పోస్టా?’
‘ప్రతి ఏడూ పది వేల రూపాయల డి.డి. ఒరిస్సాకి రిజిస్టర్ పోస్టులో పంపుతుంది’
‘ఆ రసీదు ఇలా పట్రా...’
రమణయ్య పాకలోకి వెళ్లి పోస్టల్ రసీదుతోపాటు కొంత డబ్బు తెచ్చాడు. ఆ రసీదుని పరిశీలించాడు యుగంధర్. ఒరిస్సాలోని బారిజోలా అనే ఊరికి అనాథ శరణాలయం సెక్రటరీ పేరు మీద పోస్టు చెయ్యబడింది.
రసీదు తీసుకుని వచ్చేశాడు యుగంధర్.
10
శుక్రవారం సాయంకాలం.
పాత పోస్ట్ఫాస్ సమీపంలోని వెంకటేశ్వర దేవాలయం భక్తులతో రద్దీగా ఉంది. ఆ దేవాలయంలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు రాజేష్. గుడి వెనుక ఓ గట్టు మీద కూర్చుని కనిపించింది రాసమణి. అటు నడిచి పలకరింపుగా నవ్వి పక్కన కూర్చున్నాడు.
అక్కడికి చాలా దగ్గరగా కనిపిస్తున్నది యారాడ కొండ. దానికి గుడికి మధ్య సముద్రం నుంచి వచ్చిన కాలువ అడ్డుగా ఉంది. యారాడ కొండ మీద డిఫెన్స్ వారి క్వార్టర్లు వరసగా పేర్చిన అగ్గిపెట్టెల్లా ఉన్నాయి. గుడి గంట చప్పుడు పరిసరాల్ని చైతన్యవంతం చేస్తోంది. అగరొత్తులతో జతకట్టిన కర్పూరం సువాసన ఆ ప్రదేశాన్ని అలుముకుంది.
‘ఎంత సేపయింది వచ్చి?’ అడిగాడు రాజేష్.
‘ఇప్పుడే.. పది నిమిషాలు అవుతోంది’ చెప్పింది రాసమణి.
‘ప్రతి శుక్రవారం గుడికి వస్తావా?’
‘పని లేకపోతే...’ నవ్వింది. ఎలాంటి అలంకరణ చేసుకోకపోయినా ఆమె అందంగా ఉంది. మనిషిలో ఎక్కడా అతిశయం కాని ఆర్భాటం కాని లేవు.
‘శ్రీ్ధర్ నీకు సాయం చెయ్యాలని ఎందుకనుకున్నాడు?’ ప్రశ్నించేడు.
‘అప్పటి నా పరిస్థితి ఎవరో అతనికి చెప్పి ఉంటారు. మనసున్న మనిషి కాబట్టి సాయపడాలని అనుకుని ఉండొచ్చు’ చెప్పింది.
‘సంవత్సరం క్రితం నీ పరిస్థితి ఏమిటి?’
ఒక్కసారిగా చిన్నబోయింది ఆమె ముఖం.
‘ఇష్టం లేకపోతే చెప్పొద్దు...’
క్షణాల్లో తేరుకుంది.
‘ఏమీ తెలియని వయసులో అమాయకంగా ఇంట్లోంచి బయటకొచ్చిన నన్ను ఓ మనిషి విశాఖపట్నం తీసుకొచ్చి వ్యభిచార గృహానికి అమ్మేశాడు. అప్పుడే తరచుగా ఓ యువకుడు నా దగ్గరికి వచ్చేవాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నానని, నిన్ను బయటకు తీసుకుపోతానని చెప్పేవాడు. అతని మాటలు నమ్మి మా ఓనర్‌కి మొత్తం సొమ్ము చెల్లించాను. ఒకనాడు అతను నన్ను తీసుకుపోయి ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. నాకు నాలుగు నెలలు నిండాక ఉద్యోగం కోసం వెళుతున్నానని, నేను దాచుకున్న డబ్బు పట్టుకెళ్లాడు. మూడు నెలలు దాటినా అతని నుండి ఎలాంటి కబురు రాలేదు. ఆ సమయంలో ఎవరైనా చేయూత ఇస్తే మామూలుగా జీవించేదానిని. కాని కుదర్లేదు. భూపతి మనిషి వచ్చి హాస్పిటల్లో చేర్పించాడు’ వివరించింది రాసమణి.
‘మరి శ్రీ్ధర్ ఎక్కడ పరిచయమయ్యాడు?’
‘అప్పుడే.. మిగతా వారిలానే శ్రీ్ధర్ నా కోసం వచ్చేవాడు. అందరిలా కాకుండా నా మీద సానుభూతి చూపేవాడు. ఓ యువకునితో అక్కడ నుంచి వెళ్లిపోతానని చెప్పినప్పుడు ప్రోత్సహించాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు శ్రీ్ధర్‌కి ఎవరో చెప్పి ఉంటారు’
‘సమయానికి నేను సాయం చెయ్యక పోవడం వల్ల నువ్వు తిరిగి ఆ సాలెగూడులో చిక్కుకున్నావా?’ రాజేష్ గొంతులో బాధ.
ఆమె తల అడ్డంగా ఊపింది.
‘అదేం కాదు.. నుదుటి రాతని ఎవరూ తప్పించలేరు’
ఆ మాటలు ఏ మాత్రం ఉపశమనం కలిగించలేదతనికి. శ్రీ్ధర్ అమెరికా వెళ్లకుండా ఉంటే రాసమణికి తప్పకుండా సాయపడేవాడు. అతనికి వీలుకాక ఆ బాధ్యత తనకి అప్పగించాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఆ ప్రశ్న చిన్నగా మనసులోకి ప్రవేశించి పెద్దదై కూర్చుంది.
‘్భపతి ఎవరు? ఎక్కడుంటాడు?’ అడిగేడు.
‘తెలియదు’
‘అతన్ని ఎప్పుడూ చూడలేదా?’
‘చాలాకాలం క్రితం చూశాను. మనిషి నేరుగా బయటకి రాడు. కొంతమంది మనుషులు అతని కోసం పని చేస్తారు. వారిలో గంగోత్రి ముఖ్యమైనవాడు. భూపతి గురించి అతనికి తెలుస్తుంది’
‘ఎవరైనా మీ దగ్గరకు రావాలంటే ఎలా?’
‘గతంలో వ్యభిచార గృహాలు ఉండేవి. అక్కడకొచ్చి నచ్చిన అమ్మాయితో గడిపి వెళ్లేవారు విటులు. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. ల్యాప్‌టాప్‌లో ఫొటోలు చూసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. డబ్బు చెల్లించాక అతను చెప్పిన చోటుకి అమ్మాయిని పంపుతారు’
‘నాకో అమ్మాయి కావాలంటే ఎవర్ని కాంటాక్ట్ చెయ్యాలి?’ కాస్త తటపటాయించి అడిగేడు రాజేష్.
‘నాకు వివరాలు తెలియవు’
వౌనంగా ఉండిపోయాడతను.
‘నిజంగా మీకో అమ్మాయి కావాలా?’ అడిగింది రాసమణి.
నవ్వేడు రాజేష్.
‘గంగోత్రిని కలిశాను.. అమ్మాయిలతో గడిపే ఉద్యోగం ఇస్తానన్నాడు’
తెల్లబోయి చూసింది రాసమణి.
‘నీతో పరిచయమయ్యాక భూపతి మనుషులు నా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత మా బ్యాంకులో భూపతికి అకౌంట్ ఉండటం గమనించి చిరునామా తీసుకున్నాను. ఆ చిరునామాలో కలిసాడు గంగోత్రి’ వివరించేడు.
‘మేము విధివంచితులం.. మాతో పరిచయం పెంచుకుంటే మకిలి అంటుకుంటుంది తప్ప మరేం ప్రయోజనం ఉండదు. మారుపేర్లతో మురికికూపంలో బతుకుతున్న పతితలం. మా చుట్టూ మంచి, మానవత్వం లేని మనుషులున్నారు. మీరు అందులో చిక్కుకోవద్దు’ చెప్పిందామె.
‘నీ బతుకు సరే.. నీ కూతురు సంగతేమిటి? ఆ పిల్లని మురికికూపంలో ఉంచుతావా? ఈ ఘనకార్యం చెయ్యడానికేనా ఆ పిల్లకి జన్మ ఇచ్చింది?’ కోపంగా అడిగాడు రాజేష్.
ఆమె ముఖం మాడిపోయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
‘జంతువులు కూడా తమ పిల్లలకి హాని జరిగితే తల్లడిల్లిపోతాయి. ఎగరలేనని తెలిసి కూడా పిల్ల కోసం వచ్చిన గద్ద వెంట పడుతుంది కోడిపెట్ట. పిల్లల్ని రక్షించుకోవడానికి స్థలాలు మారుస్తుంది పిల్లి. ఎక్కడెక్కడ నుంచో ఆహారం తెచ్చి పిల్లల్ని పెంచుతాయి పక్షులు. వాటికున్న జ్ఞానం కూడా నీకు లేదా?’
ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని ఏడవసాగింది రాసమణి. ఆమె తేరుకునే వరకూ వౌనంగా కూర్చున్నాడు రాజేష్.
‘ఆ పిల్ల అడ్డులేకపోతే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుందును. ఇష్టపడి బతుకుతున్నానని మీరు అనుకోవద్దు. అందరిలా జీవించాలనే కోరికతో వ్యభిచార గృహం నుండి బయటకొచ్చాను. ఓ వ్యక్తిని నమ్మి తల్లినయ్యాను. ఇప్పుడు నిండా మునిగాను. వెనక్కి దారిలేక కళ్లు మూసుకుని పోతున్నాను. నా బిడ్డకి ఎలాగైనా మంచి జీవితం ఇవ్వాలన్నది ఒక్కటే నా కోరిక..’ రాసమణి గొంతు గద్గదమైంది.
‘నీ కూతురు కోసమన్నా ఈ జీవితాన్ని వదలొచ్చు కదా?’ అన్నాడతను.
‘ఎలా? దారేది?’
రాజేష్ ఏదో చెప్పబోతుండగా చప్పున లేచి నిలబడింది రాసమణి. ఆమె ముఖం నిండా భయం. తలెత్తి చూసాడతను. రౌడీలా ఉన్న మనిషి ఒకడు గుడిలోకి ప్రవేశించి చుట్టూ చూస్తున్నాడు. రాసమణి చురుగ్గా కదిలి రాజేష్‌కి దూరంగా జరిగింది. ఆ తర్వాత గుడి మెట్ల వైపు అడుగులు వేసింది. అతను అక్కడే నిలబడి చూడసాగేడు.
రాసమణి ఆటో ఎక్కి వెళ్లిపోయాక సెల్ తీసి ఎవరితోనో మాట్లాడటం ప్రారంభించేడతను. రాజేష్ ఆ వ్యక్తిని గమనిస్తూ ఉండిపోయేడు. అతను మాటలు ముగించి మెట్లు దిగి ఓ పాత స్కూటర్ స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు.
ఆ స్కూటర్ని రాజేష్ బైక్ వెంబడించసాగింది.
* * *
‘వివేక్?’
‘యస్.. నేనే’
‘శే్వతని’
‘చెప్పండి మేడమ్!’ ఉత్సాహంగా అన్నాడతను.
‘ఈ రోజు సాయంకాలం నాలుగు గంటలకి తీరిగ్గా ఉంటావా?’
‘ఉంటాను మేడమ్’
‘రుషికొండ పక్క నుంచి బీచ్‌లోకి మట్టిరోడ్డు ఒకటి ఉంటుంది. ఆ దారిలో కుడివైపున జీడిమామిడి తోట ఉంది. నాలుగు గంటలకి అక్కడకి రా’
‘సరే మేడమ్!’
సెల్ జేబులో ఉంచుకుని చిన్నగా నవ్వుకున్నాడు వివేక్. రెండు రోజుల క్రితం వేసిన గాలానికి పెద్ద చేప చిక్కింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా హేండిల్ చెయ్యాలి. ఏమో... ఆమెని కన్విన్స్ చేస్తే తన జీవితమే మారిపోవచ్చు. మరోసారి అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది.
నీట్‌గా తయారై సరిగ్గా అయిదు నిమిషాల తక్కువ నాలుగుకి రుషికొండ పక్కనున్న మట్టిరోడ్డులోకి బైక్ పోనిచ్చాడు వివేక్. కొంత దూరం వెళ్లాక బీచ్‌ని ఆనుకుని కనిపించింది జీడిమామిడితోట. ఆ తోటలో ఓ చెట్టు దగ్గర బైక్ ఆపి చుట్టూ చూశాడు. దూరంగా సముద్రంలో చేపలు పడుతున్న నాటుపడవలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రేమ జంటలు విహరిస్తాయి.
కిందికి ఒంగిన ఓ కొమ్మ మీద కూర్చుని మట్టిరోడ్డు వైపు చూడసాగేడు. అలాంటి చోటు ఎన్నుకుని తనని రమ్మన్నదంటే శే్వతకి విశాఖపట్నంతో బాగా పరిచయం ఉండి ఉండాలి. అంతేకాదు ఆమె నివాసం అక్కడికి దగ్గర్లోనే ఉంటుందని తోచింది. కొన్ని ఫొటోలు చూసి తనని ఎన్నుకుంది. జాన్ అబ్రహాం లాంటి తన రూపం నచ్చేసి ఉంటుంది. ఈ అవకాశం తను సద్వినియోగం చేసుకోవాలి.
హఠాత్తుగా అతని గుండె ఝల్లుమంది.
చప్పున వెనక్కి తిరిగి చూశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. బలమైన కర్ర అతని తలని తాకింది. చిన్నగా మూలిగి బోర్లా క్రిందపడ్డాడు. ఓ కాలు మెడ మీద పడింది. ముఖం ఇసుకలో ఉండటంతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకోసాగాడు. చేతులతో మెడ నుంచి కాలుని వేరు చెయ్యడానికి ప్రయత్నించాడు. అంగుళం కూడా కదల్లేదు కాలు. అప్పటికే ముక్కు రంధ్రాలలోకి ఇసుక ప్రవేశించింది.
కొన్ని క్షణాల తర్వాత ఒక్కసారిగా శరీరం కదిలి ఆపైన నిశ్చలంగా ఉండిపోయింది.
నల్లగా ఉన్న వ్యక్తి అప్పుడు వివేక్ మెడ మీద నుంచి కాలు తీసేసాడు. ఒంగి చొక్కా కాలర్ పట్టుకుని శరీరాన్ని చెట్ల మధ్య నుంచి కొంతదూరం లాక్కెళ్లాడు. ఆరడుగుల లోతు గోతిని సమీపించి శరీరాన్ని అందులోకి నెట్టేశాడు. అప్పటికే అందులో ఎండు కట్టెలున్నాయి. తోట ముందు ఉంచిన వివేక్ బైక్‌ని ఆ గోతి దగ్గరకు తీసుకొచ్చాడు. ఒక చెట్టు వెనుక నుంచి సంచి తెచ్చి కూర్చుని తాపీగా బైక్ పార్ట్‌లు విప్పసాగేడు.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994