AADIVAVRAM - Others

అరోరా బొరియాలిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలి ఎంత సహజమో ‘నార్తరన్ లైట్స్’ కూడా అంతే. సూర్యుడి నుంచి విడుదలయ్యే హైడ్రోజన్ గ్యాస్ విద్యుదావేశపూరిత ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన వాయువుగా మారుతుంది. ఈ ‘ప్లాస్మా’ వినువీధిలో ‘సోలార్ విండ్’ ద్వారా ప్రయాణిస్తుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే కొంత ప్లాస్మా భూమిని చేరుతుంది. భూమి ఉత్తర దక్షిణ అయస్కాంత ధృవాలు దీనిని ఆకర్షించి తమవైపు లాగివేస్తాయి. భూ వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులలో ఈ ‘చార్జ్డ్ సోలార్ పార్టికిల్స్’ సంయోగం చెందడంతో అయాన్లు ఏర్పడతాయి.
రాత్రివేళల్లో ఇవి వలయాలుగా, తెరలు తెరలుగా ఇంకా వివిధ ఆకృతుల్లో వివిధ వర్ణాలు విరజిమ్ముతూ ఆకాశంలో ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో కనువిందు చేస్తాయి. ఉత్తర ధృవం వద్ద ఇవి సుస్పష్టంగా గోచరిస్తాయి. దక్షిణ ధృవం వద్దా ఇదే మాదిరి దృశ్యం ఆవిష్కృతమైనా ఎక్కువసేపు ఉండదు. కాబట్టి ‘నార్తరన్ లైట్స్’గా ఈ ‘అరోరా బొరియాలిస్’ ఎఫెక్ట్ ఏడు ప్రకృతి వింతల్లో చేరింది.

-బి.మాన్‌సింగ్ నాయక్