రాష్ట్రీయం

సిఐడి కస్టడీకి ఎఎస్‌ఐ బినామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెయిల్ పిటిషన్ 27వరకు వాయిదా
నాలుగురోజుల కస్టడీకి అనుమతి

కరీంనగర్, నవంబర్ 21: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, డబ్బులు చెల్లించని వా రిని బెదిరింపులతో భయబ్రాంతులకు గురిచేస్తూ జైలులో ఊసలు లెక్కపెడుతున్న ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ప్రధాన బినామీ పుర్మ శ్రీ్ధర్‌రెడ్డిని నాలుగు రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి అజార్‌హుస్సేన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తన న్యాయవాది ద్వారా శ్రీ్ధర్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఈ నెల 27వరకు వాయి దా వేసింది. కస్టడీ సమయంలో ఎలాంటి థర్డ్ డిగ్రీలు ఉపయోగించవద్దని, కస్టడీ అనంతరం ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు కోర్టులో హాజరుపర్చాలని సిఐడి అధికారులకు ఆ ఉత్తర్వుల్లో సూచించారు. హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన దొనపాటి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు మో హన్‌రెడ్డితోపాటు ఏడుగురు నిందితులపై క్రైమ్ నెంబర్ 25/2015లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాల్గువ నిందితుడిగా ఉన్న శ్రీ్ధర్‌రెడ్డిని ఈ నెల 17న కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూ ర్తి జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆదేశించారు.