జాతీయ వార్తలు

న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం మూల వ్యవస్థను కూల్చరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ, నవంబర్ 28: సుప్రీంకోర్టు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి) చట్టాన్ని కొట్టివేయడాన్ని సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి తన విమర్శలకు పదును పెట్టారు. కేవలం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం ఎన్నికయిన ప్రభుత్వం, పార్లమెంటు సార్వభౌమాధికారం సహా ప్రజాస్వామ్య వౌలిక వ్యవస్థను కూల్చివేయరాదని అభిప్రాయ పడ్డారు. అంతేకాదు సుప్రీంకోర్టు తన తీర్పును పునః పరిశీలించాలని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ఎన్‌జెఏసి చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుశా నేను కాస్త గట్టిగానే మాట్లాడుతుండవచ్చు. భవిష్యత్తులో ఏదో ఒక దశలో మనం దీన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్టప్రతి జడ్జీలను నియమించాలని చట్టం చెబుతోందంటే దాని అర్థం ప్రధాన న్యాయమూర్తి ఎవరినీ సంప్రదించకుండా వారిని నియమిస్తారని కాదని ఆయన అన్నారు. అంతేకాదు దీన్ని ఆధారంగా చేసుకుని ఒక వ్యవస్థను న్యాయవ్యవస్థ తనకున్న అధికారాలను ఉపయోగించి మాత్రమే కాపాడగలదని, ఎన్నికయిన ప్రజా ప్రతినిధులను నమ్మడానికి వీల్లేదని వాదన కూడా వస్తుందని అయితే అది సరయిన వాదన కాదని జైట్లీ అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత మూల స్తంభాల్లో ఒకటని, ఎన్నికయిన ప్రభుత్వం, ఎన్నికయిన పార్లమెంటు కూడా అలాంటివేనని ఆయన అన్నారు. కేవలం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం మిగతా అన్ని మూల స్తంభాలను కూల్చివేయడం సరికాదని నగరంలోజరిగిన ‘టైమ్స్ లిట్‌ఫెస్ట్’లో మాట్లాడుతూ జైట్లీ అన్నారు.