రాష్ట్రీయం

ఆగమ శాస్త్రాలకు అనుగుణంగానే అర్చకుల నియామకం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం తీర్పును స్వాగతించిన ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం

హైదరాబాద్, డిసెంబర్ 17: హిందూ దేవాలయాల్లో అర్చకుల నియామకం విషయంలో ఆయా దేవాలయాలకు సంబంధించిన ఆగమ సంప్రదాయం వారినే అర్చకులుగా నియమించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కెసిఎస్‌ఆర్‌ఎస్ ఆచార్యులు, తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం 2006లో జారీ చేసిన జీవో ప్రకారం హిందువైన ఏ వ్యక్తి అయినా అవసరమైన అర్హత శిక్షణ ఉంటే అర్చకులుగా నియమించవచ్చనే విధంగా నిబంధనలు రూపొందించారన్నారు.
ఈ జీవో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో వెలువరించిన శేషమ్మాల్ కేసులో తీర్పు, సిరూర్ మఠ్ తీర్పు తదితర తీర్పులకు విరుద్ధంగా ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగ చట్టంలో మత శాఖల స్వాతంత్య్రం చర్చించిన అధికరణ 25, 26లను, మత సంస్థలతో వివిధ నియామకాలకు అధికరణ 16(5)లో ఇచ్చిన వెసులుబాటును కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుందన్నారు. రాజ్యాంగంలోని 25, 26 అధికరణలో, అధికరణ 16(5)లో మతశాఖలకు ఇచ్చిన స్వేచ్ఛను గుర్తించకుండా అధికరణ 14కు విరుద్ధమనే మిషతో మతశాఖల స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. దేవాలయాల్లో మత సంస్థల్లో మితిమీరి జోక్యం చేసుకుని చట్టాలు, జీవోలు చేయడం తగదని ఈ తీర్పు స్పష్టం చేసిందన్నారు.