రుచి

అరటి కాయ వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. లేత అరటి కాయలు అయితే అజీర్ణం చేయవు. అరటి పువ్వు, దూట,కాయలు, అన్నీ కూడ తింటాము. అరటి ఆకులో అన్నం తినడం అత్యంత శ్రేష్టం. అరటి పండును శుభ కార్యాలకు దేవతా పనులకు తప్పనిసరిగా వాడతారు. ఇది జీర్ణకోశ వ్యాధులపై పనిచేస్తుంది. దీన్ని చిన్న చిన్న చక్రాలుగా చేసి ఎండబెట్టి చూర్ణం చేసి తేనె లేక బెల్లంతో తింటే జిగట విరేచనాలు, అమీబియాసిస్ తగ్గుతుంది. అందుకే అరటికాయ కాల్చిన పచ్చడి కూడా చేస్తారు. స్ర్తిల వ్యాధులు, హెర్నియా, మూత్రపిండాల్లో రాళ్లు, బిపి, సుగర్, మలబద్ధకం, అసిడిటీ, ఆయాసం వంటివాటికి నివారిణిగా చెప్పాలి. అందుకే లేత అరటికాయలతో కూర, పచ్చడి, బజ్జీలు, వడలు, వేపుడు, కుర్మా, పులుసు, ఇంకా ఎన్నో రకాలు ఆవపెట్టి, అల్లంపెట్టి, పులుసుపెట్టి, నువ్వులపొడి, టమాటో రసంతోను చేస్తారు.

పొడికూర
అరటికాయలు-2, నిమ్మకాయలు-2,
కరివేపాకు-కొంచెం, పచ్చిమిర్చి-5,
ఆవాలు-1 చెంచా, జీలకర్ర-1 చెంచా,
మినపప్పు-2 చెంచాలు,
శనగపప్పు-2 చెంచాలు, ఉప్పు-1 చెంచా,
నూనె-అరకప్పు, ఎండుకొబ్బరి-2 చెంచాలు
పసుపు-చిటికెడు, ఎండుమిర్చి-2

అరటికాయ కడిగి తుడిచి నూనెరాసి స్టౌపై కాల్చాలి. నల్లగా వస్తుంది. వేడిదాన్ని అలా పావుగంట వుంచాలి. చల్లారాక తొక్క వలవాలి. ఇప్పడు ఈ అరటికాయను చిదమాలి. పొడిపొడిగా పొట్టులా వస్తుంది. దీన్ని పక్కనపెట్టి బాణలిలో నూనె వేసి పోపులు వేయించి కొబ్బరి వేయించి ఉప్పువేసి కలిపి ఈ అరటిపొడిని వేసి కలిపి 5 నిముషాలు వుంచి దింపి చల్లార్చాలి. నిమ్మకాయ రసం వేసి పసుపు వేసి కలిపి దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని పెట్టుకుని చల్లార్చిన అరటిపొడిని వేసి కలపాలి.

కోఫ్తా కర్రీ
ఉల్లి ముక్కలు-1 కప్పు,
అరటికాయ ముక్కలు- 2 కప్పులు,
నూనె-250 గ్రా,
శనగ పిండి-1 కప్పు,
జీలకర్ర-1 చెంచా,
కారం-2 చెంచాలు,
బియ్యం పిండి-4 చెంచాలు,
జీడిపప్పు-12,
గసగసాలు-1 చెంచా,
కొబ్బరి కోరు 4 చెంచాలు,
క్రీమ్-5 చెంచాలు,
మసాలా కారం-4 చెంచాలు.
శనగపిండి బియ్యంపిండి జీలకర్ర కారం కలిపి నీరు చేర్చి కలిపి దీనిలో అరటికాయ ముక్కలు ముంచి నూనెలో వేయించిత కోఫ్తాలు రెడీ. ఉల్లి, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి కోరు మిక్సీపట్టాలి. వేరే బాణలిలో కొంచెం నూనె పోసి ఈ ముద్దను వేగనిచ్చి మసాలా కారం వేసి కొంచెం నీరుపోసి మగ్గాక కోఫ్తాలు వేసి క్రీమువేసి కలిపి దింపి కొత్తిమీరతో అలంకరించాలి.

వడలు
అరటికాయలు-2
కార్న్‌ఫ్లోర్-5 చెంచాలు
శనగపిండి- 1 కప్పు
బియ్యం పిండి-1/2 కప్పు
నూనె-250 గ్రా,
ఉఫ్పు-2 చెంచాలు,
పచ్చిమిర్చి-6,
ఉల్లిముక్కలు-1 కప్పు
వాము-1/2 చెంచా
పసుపు చిటికెడు,
రస్కులపొడి-1 కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్ట్-4 చెంచాలు.

ముందుగా అరటికాయ ఉప్పుపసుపు వేసి ఉడికించి తొక్క వలిచి దీనిలో పిండిలన్నీ కలిపి పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వాము కలిపి నీళ్లు చేర్చి వడలు పిండిలా చేసుకోవాలి. దీన్ని వడలుగా తట్టి రస్కుల పొడిలో ముంచాక కార్నఫ్లోర్ ఒక కప్పు నీటిలో కలిపి దానిలో వడని ముంచితీసి నూనెలో వదలాలి. ఇవి వేగాక తీసి పళ్లెంలో పెట్టాలి. ఇలా పిండి అంతా వడలుగా తట్టి వేయించుకోవాలి.

నువ్వుల పొడి ఫ్రై
అరటి కాయలు రెండు
జీలకర్ర-2 చెంచాలు
నువ్వుల పొడి -1 కప్పు
కరివేప కొంచెం
ఎర్రకారం-4 చెంచాలు
నూనె-1/2 కప్పు
ఉప్పు-2 చెంచాలు
వెల్లుల్లి రేకలు-24
పచ్చిమిర్చి-8
లేత అరటికాయలు తొక్క తీసి అర్థ చక్రాల్లా పలుచగా తరుగుకోవాలి. బాణలిలో నూనెవేసి వీటిని వేయించాలి. బాగా వేగాక వెల్లుల్లి రేకలు, కరివేప వేయించి ఉప్పు కారం నువ్వుల పొడి చల్లి మరో ఐదు నిముషాలు వేయించి తీయాలి. దీనిలో సన్నగా తరిగి వేయించిన పచ్చి మిర్చి జీలకర్రతో కలిపి వడ్డించాలి.

కుర్మా కూర
అరటి కాయలు-2,
పెరుగు-1 కప్పు
మసాలా పౌడర్-4 చెంచాలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్-4 చెంచాలు,
నూనె-1/4 కప్పు,
కరివేప కొంచెం,
ఉప్పు-1 చెంచా,
టమోటా పేస్ట్-1 కప్పు,
వేరుశనగ పప్పు-1/4 కప్పు,
ఎండుమిర్చి కారం-4 చెంచాలు,
కొత్తిమీర- కొంచెం,
జీలకర్ర-1 చెంచా
పసుపు-1 చెంచా.

ముందుగా అరటికాయ తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరిగి ఉప్పు పసుపు వేసి తగినంత నీరు చేర్చి ఉడకపెట్టాలి. బాణలిలో నూనెవేసి జీలకర్ర వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక దాంట్లో మసాలా కారం వేసి టమోటా రసం పోసి ఉడికించాలి. దీంట్లో కారం కొత్తిమీర కరివేప వేసి వేరుశనగ పప్పు చేర్చి కలపాలి. బుడగలు వస్తుండగా అరటి కాయ ముక్కలు వేసి కలపాలి. దింపేసి పెరుగుచేర్చి కలపాలి.

అరటికాయలు-2,
అల్లం కోరు-2 చెంచాలు,
పచ్చిమిర్చి-5,
ఎండుమిర్చి-5,
ఆవాలు-2 చెంచాలు,
జీలకర్ర-1 చెంచా,
మినపప్పు 2 చెంచాలు,
శనగపప్పు-2 చెంచాలు,
ఉప్పు-ఒకటిన్నర చెంచా
నూనె-1/4 కప్పు,
పసుపు- అర చెంచా,
చింతపండు రసం
-1/4 కప్పు.
ఇది 3 ఇన్ వన్ కూర.

అరటికాయ ముచికలు తీసివేసి పసుపు-1/2 చెంచా ఉప్పువేసి అరటికాయలు వేసి కుక్కర్‌లో పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక చల్లార్చాక తొక్క వలిచి ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె కాగాక పోపులు వేయించి అల్లం మిర్చి ముద్దగా నూరినది వేయించి దానిలో పైన చేసుకున్న అరటిముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా చింతపండు రసం వేసి కలిపి ఐదు నిముషాలు మగ్గించి దింపాలి. ఇది ఆవపెట్టి కూర అయితే అల్లం బదులు ఆవాలు నీటిలో నూరి ఆ ముద్దవేసి కలపాలి. నువ్వుల పొడి అయితే ఆవ బదులు వేయించిన నువ్వుల పొడి చల్లాలి.

-చందన