ఆంధ్రప్రదేశ్‌

లక్షలు కాజేసిన ఫేస్‌బుక్ అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, జూన్ 21: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ యువతి కడప యువకుడితో చాటింగ్ చేస్తూ లక్షలు కాజేసింది. అమ్మాయి మోజులో పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకున్న ఆ యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ఖాజీపేటలో సోమవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రమేష్(27) ఖాజీపేట బస్టాండులో టీ హోటల్ నిర్వహిస్తున్నాడు. విశాఖపట్టణానికి చెందిన కల్యాణి ఉరఫ్ అనసూయతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ప్రతిరోజు ఆ యువతితో చాటింగ్ చేసేవాడు. డబ్బు అవసరం ఉందంటూ ఆ యువతి తన బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చి బ్యాంకులో జమచేమమని కోరింది. ఆమె చెప్పినట్టుగానే రమేష్ విడతలు విడతలుగా రూ.3 లక్షలు ఖాతాలో జమచేశాడు. కొద్దిరోజుల తరువాత డబ్బు తిరిగి ఇవ్వమని ఫోన్లో సంప్రదించగా మీరు ఎవరో తెలియదంటూ ఆ యువతి ఫోన్ కట్ చేసింది. రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఫేస్‌బుక్‌లో సమాచారం లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన రమేష్ ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తమ కుమారుడు విశాఖ యువతికి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పినట్లు అకౌంట్ పుస్తకాలు, ఫోన్ రికార్డులు ఉన్నాయని రమేష్ తండ్రి నర్సిహారావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాజీపేట ఎస్‌ఐ రాజగోపాల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రమేష్ (పాతచిత్రం)