ఆంధ్రప్రదేశ్‌

లేడీ డాన్ సంగీతా చటర్జీ అరెస్టుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 18: ఎర్రచందనం అక్రమ రవాణాలో బడా స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్ధిక లావాదేవీలను నిర్వహిస్తున్న కోల్‌కతాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా చటర్జీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇటీవల చిత్తూరు పోలీసులు కోల్‌కతాలో ఆమె ఇంటిపై దాడులు నిర్వహించి రెండన్న కిలోల బంగారు, కిలో వెండి ఆభరాణాలు పలు అపార్ట్ మెంట్లకు సంబంధించి పత్రాలు , నకిలీ గన్‌లైసెన్సును స్వాధీనం చేసుకొన్నారు. చిత్తూరు ఏఎస్పీ రత్నా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన లక్ష్మణన్ గత కొంత కాలంగా ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించే వాడు. దీంతో అతన్ని 2014లో అరెస్టు చేసి పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన లక్ష్మణన్ తిరిగి స్మగ్లింగ్ వ్యవహారాలను ప్రారంభించడంతో 2015 డిసెంబర్ నెలలో అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు. అతనిపై చిత్తూరు జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. జైలులో లక్ష్మణన్ ఉండగా అతని రెండో భార్య అయిన ఎయిర్ హోస్టెస్ సంగీతా ఛటర్జీ ఎర్రచందనం అక్రమరవాణాలో కీలక భూమిక పోషించడతో పాటు భారీ స్థాయిలో నగదు లావాదేవీలను నిర్వహిస్తుండేది. ఆమెపై చిత్తూరు జిల్లాలోని యాదమరి స్టేషన్‌లో కేసు నమోదుకేసులు నమోదయ్యాయి. దీంతో ఈనెల 9న చిత్తూరుకు చెందిన డిఎస్పీ గిరిధర్ అధ్వర్యంలో కోల్‌కతాలోని సంగీతా ఇంటిపై దాడులు నిర్వహించి, రెండు బ్యాంకు లాకర్లను, విలువైన ఆస్తుల పత్రాలను, 9 సెల్ ఫోన్లను, స్వాధ్వనం చేసుకొన్నారు. యూకో బ్యాంకు లాకర్లలో ఉన్న సుమారు రెండు కోట్ల విలువ చేసే బంగారు నగలు ఇతర ఆస్తుల పత్రాను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నా సంగీతా చటర్జీకి సోమవారం వరకు బెయిల్ ఉన్న నేపధ్యంలో తదుపరి విచారణ కోసం కూడా తమ కస్టడీకి తీసుకుంటామన్నారు. గతంలో ఆమెను కోల్‌కతాలో అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదయ్యారని, అప్పటి నుంచి తనకు ఆరోగ్యం సక్రమంగా లేదని బెయిల్‌ను పొడిగించుకొంటూ వస్తున్న సంగీతా సోమవారంతో బెయిల్ గడువు ముగియనుండటంతో అనంతరం చట్టప్రకారం ఆరెస్టు చేసి చిత్తూరుకు తీసుకు రానున్నట్లు తెలిపారు.

చిత్రం కోల్‌కతాలో మహిళా స్మగ్లర్ సంగీతా చటర్జీ ఇంటి నుంచి చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకొన్న బంగారు, వెండి నగలు