ఆంధ్రప్రదేశ్‌

నిలువునా ఉరితీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూన్ 18: రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం అడవివరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసిన మంత్రి చలించిపోయారు. అస్తవ్యస్తంగా ఉన్న విదార్థుల వసతి గదులు, విరిగి పోయిన మంచాలు, తలుపు, విద్యుత్‌దీపాలు, ఫ్యాన్‌లు లేక శిథిలమైపోయివున్న గదులు, పురుగులు తేలియాడుతున్న నీరు.. ఇలా ఒకటి కాదు.. పాఠశాలలో అడుగడుగునా దర్శనమిచ్చిన అపారశుద్ధ్యాన్ని చూసిన మంత్రి తీవ్ర అసహనానికి లోనై గురుకుల ఉపాధ్యాయలతోపాటు బిసి వెల్ఫేర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వంటగదిలోని నీటి టాంక్‌లో పురుగులు కనిపించడం, అదే నీరు వంటకు ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న మంత్రి కోపాన్ని ఆపుకోలేకపోయారు. వీళ్ళని నిలువునా ఉరితీయాలంటూ వ్యాఖ్యానించారు. మీ ఇంట్లో అయితే ఈ నీరు వంటలకు వాడతారా ? మీ పిల్లలనైతే ఈ మంచాలపై పడుకోబెడతారా..? అంటూ మంత్రి అసహనం వ్యక్తం చేసారు. శిథిలమైపోయిన మరుగుదొడ్లు, స్నానం గదులకు మరమ్మతులు చేయకుండానే రంగులు వేసేస్తారా? అంటూ మంత్రి బిసి వెల్ఫేర్ అధికారులను నిలదీసారు. రెండు గంటల పాటు అన్ని విభాగాలను పరిశీలించిన మంత్రి గంటా చివరిగా విద్యార్థులతో సమావేశమై మాట్లాడే ముందు విద్యార్థులను క్షమాపణ కోరారు. ఇంత కాలం ఈ పాఠశాల దీనస్థితిని తెలుసుకోనందుకు క్షమాపణ కోరుతున్నానని మంత్రి అన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారన్న భయం వద్దని మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిర్మొహమాటంగా చెప్పండని మంత్రి విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో విద్యార్థులు తమ ఆవేదనను, అవసరాలను మంత్రికి ఏకరువుపెట్టారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ శంకరరావు సమస్యలను మంత్రికి వివరించారు. గురుకుల పాఠశాలను మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. పాఠశాల స్థితి గతులపై బిసి సంక్షేమ శాఖా మంత్రితో మాట్లాడానని ఆయన విద్యార్థులకు చెప్పారు. బిసి సంక్షేమ శాఖతో పాటు సింహాచలం దేవస్థానం, విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయమై కలెక్టర్, ఈవోతో కూడా చర్చించామని ఆయన అన్నారు. జాయింట్ కలెక్టర్ 2 వెంకటరెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి అనుసంధాన కర్తగా ఉంటారని మంత్రి చెప్పారు.