ఆంధ్రప్రదేశ్‌

రక్తమోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు/రాయవరం, జూన్ 18: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నలుగురు, మండల కేంద్రం రాయవరంలో ఇద్దరు మృతి చెందారు. ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై జోడుగడ్ల వాగు వద్దకు కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న కొత్తపల్లి వెంకటేశ్వరరావు(46), తల్లి నాగేంద్రమ్మ(65), కుమారుడు కొత్తపల్లి సాయి(19) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వరరావు భార్య మాలతికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను, తీవ్రగాయాలైన మాలతిని ప్రత్తిపాడు సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ నాగ దుర్గారావులు 108 వాహనంలో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాలతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను కాకినాడ జిజిహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కుటుంబం చాలా కాలం నుండి గుంటూరు జిల్లా నారకోడూరు గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. స్వగ్రామమైన విజయనగరం కారులో బయలుదేరి వెళ్ళుచుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ, ఎస్‌ఐ నాగ దుర్గారావులు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు. అలాగే రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్లు శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కూతురు వైద్యం కోసం మోటారు సైకిల్‌పై వెళ్తున్న లంక రత్నం (24)తో పాటు ఆమె తొమ్మిది నెలల కూతురు హనీ ఈ సంఘటనలో మృత్యువాత పడ్డారు. మోటారుసైకిల్ నడుపుతున్న కొమ్ము నవీన్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. హనీకి అనారోగ్యంగా ఉండటంతో బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి నవీన్‌తో కలసి మోటరుసైకిల్‌పై వెళ్తుండగా స్థానిక చాణుక్య నర్సింగ్‌హోమ్ ఎదురుగా వచ్చేసరికి వెనుకనుండి వస్తున్న టిప్పర్ మోటారుసైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ రత్నం నడుముపై నుండి దూసుకుపోవడంతో ఆమె తీవ్రగాయాల పాలయ్యింది. అలాగే చిన్నారి హనీ తలకు తీవ్రగాయమయ్యింది. రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తల్లీ కూతుళ్లను ఎదురుగా ఉన్న ఆసుపత్రికి తరలించగా కొన ఉపిరితో ఉన్న రత్నం మృతి చెందెంది. ఆమె మృతి చెందిన కొద్ది సమయానికే చిన్నారి హనీ కూడా మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని అనపర్తి సిఐ ఎస్.రాంబాబు, ఎస్‌ఐ బిఎస్ అప్పారావు, ఎఎస్‌ఐ కెవివి సత్యనారాయణలు పరిశీలించారు.