ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్ర ప్రభుత్వం కూడా తెలంగాణ తరహాలో సమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రా ఆర్టీసి ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తరహాలో ఏపి ప్రభుత్వం కూడా ఆర్టీసిలో అధికారులతో విసృత స్ధాయి సమావేశం నిర్వహించాలని ఏపిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి వి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసి ఎండి సాంబశివరావు ఆర్టీసి అభివృద్ధికి మెరుగైన చర్యలు తీసుకుంటున్నారని, కాని పూర్తిస్థాయి వాస్తవ వివరాలు తెలుసుకునేందుకు ఒక సదస్సును నిర్వహించాలని కోరారు. విభజన తర్వాత ఆంధ్రా ఆర్టీసి అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనైందన్నారు. ఆర్టీసిని నష్టాల నుంచి బయటు తెచ్చేందుకు పైనుంచి కింది స్థాయి అధికారులు, యూనియన్ల సలహాలను తీసుకోవాలని కోరారు.కెసిఆర్ సమీక్షా సమావేశంలో ఆంధ్రానుంచి వచ్చే సర్వీసుల గురించి తెలుసుకున్నారన్నారు. వీటిని తగ్గిస్తే ఆంధ్రా ఆర్టీసి ఇక్కట్లకు గురవుతుందన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం ఆంధ్రా నుంచి వెళ్లే సర్వీసులు తొలగించకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విభజన వల్ల ఆర్టీసికి నష్టం వాటిల్లిందని, చట్టప్రకారం రాయితీలు రావాల్సి ఉందని, ఆస్తుల్లో వాటా ఉందని, వీటిని రాబట్టుకునే విషయమై దృష్టిని సారించాలన్నారు.