ఆంధ్రప్రదేశ్‌

20న గుంతకల్-కల్లూరు డబ్లింగ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: వైద్య సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అన్యాయం జరుగకుండా జాగ్రత్తలు పాటించినట్టు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్‌లో చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. హైదరాబాద్ నుండి అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకోసమే 20న అమరావతి రైలు ప్రారంభించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అదే రోజు గుంతకల్- కల్లూరు మధ్య డబ్లింగ్ పనులకు సిఎం శంకుస్థాపన చేస్తారని అన్నారు. వీటితో పాటు రైల్వేలో అనేక రవాణా వసతి సదుపాయాలను కేంద్రం కల్పించనుందని చెప్పారు. ఆంధ్రాలో జన ఔషది పథకం కింద 200 మందుల షాపుల ద్వారా 449 రకాల మందులను అతితక్కువ ధరకు అందించనున్నామని కామినేని చెప్పారు. ఈ మందులు అందుబాటులోకి వస్తే పేదలకు ఆర్ధిక బాధలు తగ్గి వైద్య, ఆరోగ్యపరంగా వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. ఆంధ్రాలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వసతి సదుపాయాలు స్థాయి ప్రమాణాలకు తగినట్టు లేవనే కారణంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కరమే అయినా తాజా పరిస్థితిని అధ్యయనం చేసి మరో నివేదిక ఇవ్వనుందని అన్నారు. చాలా కాలంగా వివిధ పోస్టులకు ఎదురుచూస్తున్న వారికి వెసులుబాటు కల్పిస్తూ, ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రూపొందించిన వికాస్‌పర్వ్, యోగా, స్మార్టు సిటీస్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంలో వెంకయ్యనాయుడు నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడుకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని, అయితే వివిధ రాజకీయ పార్టీలు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని వ్యవహారాలు సాగిస్తున్నాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది గతంలో వైఎస్సారేనని అన్నారు. ఆపరేషన్ ఆకర్ష పేరిట వైఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనను నిరంతరం పరీక్షించేందుకు ప్రత్యేక బృందం ఉందని అన్నారు.