ఆంధ్రప్రదేశ్‌

కాపు మంత్రుల కుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తెదేపా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలను కులం నుంచి బహ్కిరించాలని ఆలిండియా కాపు జాగృతి పిలుపునిచ్చింది. అదే సమయంలో నెల్లూరు జిల్లా కాపు సంఘం కూడా అధికారపార్టీలోని కాపు మంత్రులను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమయింది. ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలను కుల బహిష్కరణ చేయాలన్న అంశంపై కాపువర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు ఇటీవల ‘ఆంధ్రభూమి’లో వార్తాకథనం వెలువడిన విషయం తెలిసిందే.
కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కులద్రోహులుగా మారి చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని, అలాంటి వారిని కులం నుంచి బహిష్కరించాలని ఆలిండియా కాపు జాగృతి కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది సతీష్ గల్లా పిలుపునిచ్చారు. ఇప్పటికే బాబు సర్కారుపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. శనివారం ఆయన తెనాలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిడిపి కాపు ప్రజాప్రతినిధులపై నిప్పులు కురిపించారు. మూడేళ్ల తర్వాత రాజకీయాల్లో మీ ఉనికి ఉండదని, బాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని హెచ్చరించారు. ‘ముద్రగడపై బాబు ప్రోద్బలంతో విమర్శలు చేస్తూ, సొంత జాతికి ద్రోహం చేస్తున్న మీరు చరిత్ర హీనులుగా మారతారు. చివరకు మీ ఇళ్లకు మీ బంధువులు భోజనాలకూ రాని పరిస్థితి వచ్చింది. దీన్ని గమనించి వ్యవహరించండి. ఇక మీ ఆటలు మూడేళ్లే. ఆ తర్వాత మీ ముఖాలను కాపుజాతి కనె్నత్తికూడా చూడని దౌర్భాగ్యంలో ఉంటార’ని సతీష్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ముద్రగడను మానసికంగా, శారీరకంగా దెబ్బతీసిన బాబు సర్కారుకు నూకలు చెల్లాయని, మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల కోసం కాపులు ఎదురుచూస్తున్నారని, అప్పుడు బాబుకు భజన చేస్తున్న కాపు ప్రజాప్రతినిధులెవరూ పార్టీని కాపాడలేరని హెచ్చరించారు. తమ పిలుపుననుసరించి, కాపుజాతి అంతా టిడిపి కాపులను ఏ కార్యక్రమాలకూ పిలవద్దని, సొంత జాతిని అవమానించినందుకు వారికి అదే సరైన శిక్ష అని స్పష్టం చేశారు.
ముద్రగడ కాపుల కోసం ఉద్యమం చేస్తుంటే, సహకరించకపోయినా వౌనంగా ఉండకుండా, ముద్రగడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. తుని ఘటనలో గోదావరి జిల్లాల వారెవరూ లేరని చెప్పిన బాబు, ఇప్పుడు 13 మంది కాపులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.
కాగా, నెల్లూరు జిల్లా కావలిలో ప్రముఖ కాపు నేత చింతాల వెంకట్రావు ఆధ్వర్యాన శనివారం ముద్రగడకు మద్దతుగా రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముద్రగడ వ్యక్తిత్వం, నిజాయితీ, త్యాగాన్ని అవమానించేలా మాట్లాడుతున్న మంత్రులు నారాయణ, చిన రాజప్ప, గంటా శ్రీనివాస్‌లను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ముద్రగడ శాంతియుత పంథాను అనుసరించినందుకే కాపులంతా శాంతంగా ఉన్నారని, కాపులు కనె్నర్ర చేసి రోడ్డెక్కితే బాబు సర్కారు తట్టుకోలేదని స్పష్టం చేశారు.