ఆంధ్రప్రదేశ్‌

ఆ పథకాలకు చంద్రన్న పేరెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, మే 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు ప్రకటిస్తున్న కానుకల్లో చంద్రన్న భజన ఎందుకని మాజీ మంత్రి, కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. కాపు భవన్‌కు చంద్రన్న పేరు పెడుతూ ప్రభుత్వం ఇచ్చిన జిఓలో ఆ పేరును తొలగించాలని కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, యువత డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ముద్రగడ లేఖ రాశారు. కిర్లంపూడిలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆ లేఖను విడుదలచేశారు. ఆత్మ గౌరవం అనేది అందరికీ ఉంటుందని చెబుతూ కాపులు బానిసలనే భావనను తొలగించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు సామాజిక వర్గ భవనాలు (్ఫంక్షన్ హాల్స్) మీద కాపు, కమ్మ భవన్ అని రాయించమని ప్రభుత్వం జిఓ ఇవ్వగలదా అని ప్రశ్నించారు. అసలు సమస్యను దాటవేయడానికి కొత్త ఎత్తుగడలు వేయవద్దన్నారు. కాపులను బిసిల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే సంతోషిస్తామన్నారు. చంద్రన్న కానుకల దండకం పత్రికల్లో చూశానని, సహాయం పొందేవారికి సహాయం చేసే వారి పేరు పెట్టుకోవాలనే భావన రావాలని, సొంత ఆస్తులు విరాళం ఇచ్చినట్లు దానకర్ణుడి అవతారం ఎత్తవద్దన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో పుట్టిన పిల్లలకు చంద్రన్న పేరు పెట్టాలని ప్రభుత్వ ఉధ్యోగులకు చంద్రన్న జీతం, వ్యాపార సంస్ధలు, గృహాలకు కూడా చంద్రబాబు పేరు పెట్టాలని శాసనం చేస్తారేమోనని అంటూ ఈ కాంక్ష ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, ఎవ్వరైనా విరాళం ఇవ్వవచ్చునని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు. కాపులు పన్నుల రూపంలో కోట్లాది రూపాయులు ప్రభుత్వానికి చెల్లించడం లేదా ఆ నిధులను తమ కోసం ఖర్చు చేయకుండా జాతిని బిచ్చగాళ్లలా చూపించడం ఎంతవరకు న్యాయమన్నారు. మోచేతి నీళ్లు తాగి బ్రతకాలా అని డును ప్రశ్నించారు. మరికొంత కాలం పోతే కాపులకు మీ తాలుకు వారి రక్తం ఎక్కించుకోమని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్య పోనక్కరలేదని అనుకుంటున్నానన్నారు.