ఆంధ్రప్రదేశ్‌

కాపు భవనాలకు చంద్రన్న పేరు సబబే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 23: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న కాపు సంక్షేమ భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును పెట్టడంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. కాపు సంక్షేమ భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం సబబేనన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని సోమవారం జరిగిన మినీ మహానాడులో ఆయన ప్రసంగించారు. కాపుల సంక్షేమం పేరుతో ముద్రగడ పద్మనాభం చేసే ధర్నాలు, దీక్షలకు కాపులెవరూ రోడ్డెక్కవద్దని చినరాజప్ప సూచించారు. ముద్రగడను నమ్మవద్దని, అతడిని నమ్మి ఉద్యమాలు చేయవద్దని సూచించారు. కాపుల సంక్షేమం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని ఇప్పటికే కాపు సామాజికవర్గం గుర్తించిందన్నారు. తాను రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తున్నట్టు మాజీ ఎంపి హర్షకుమార్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపి పదవి పోయి, పనీపాటు లేకపోవడంతో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.