ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కోసమే ప్రజల మధ్య చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 23 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారారని, ముఖ్యంగా తన ఉనికిని చాటుకునేందుకు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కడపలో సోమవారం నిర్వహించిన టిడిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగన్ ఏపిలో పర్యటించినప్పుడు ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణలో పర్యటించినప్పుడు ఏపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి అడ్డుతగులుతున్న జగన్‌కు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. తన తండ్రి హయాంలో అక్రమంగా వేలాది కోట్ల రూపాయలు దోచుకుని దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకోవడం, ఎక్కువ జలాల విడుదల వాటాను అతిక్రమిస్తే తమ ప్రభుత్వం చట్టపరంగా హక్కుల కోసం పోరాడుతుందని మంత్రులు స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించిన సమయంలో రాయలసీమకు పోలవరం, పట్టిసీమ ద్వారా నీరిస్తున్నారని, దీంతో ఈ ప్రాంతాలు ఎడారిగా మారుతాయని అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని, అదే సీమ జిల్లాల్లో పర్యటించినప్పుడు సీమ జిల్లాలకు కృష్ణా జలాలు రావని, ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికావని, అభివృద్ధి అంతా ఇతర ప్రాంతాల్లో జరుగుతోందని చెబుతూ ప్రాంతాల వారీగా రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.