ఆంధ్రప్రదేశ్‌

అనంతలో కిడ్నాప్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 23: అనంతపురం జిల్లాలో దందాలు, కిడ్నాప్‌ల పర్వం మళ్లీ మొదలైంది. నగరంలో ఉన్న ఆడిటర్ ఆనందరెడ్డి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేయాలన్న లక్ష్యంతో 13 మంది సభ్యులుతో కూడిన ముఠా పథకం పన్నింది. ఈ మేరకు ఆడిటర్‌కు స్నేహితుడు, రెండు దశాబ్దాల క్రితం కారు బాంబు కేసు ఫిర్యాదుదారుడైన రాజారెడ్డిని గత నెల 12వ తేదీ రాత్రి నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న అతడి ఇంట్లో భార్యా పిల్లలతో ఉండగా కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో అత్యధికులు ఫ్యాక్షన్ అరాచకాలు, రాష్ట్రంలో అలజడులు సృష్టించి హత్యకు గురైన మద్దులచెరువు సూరి సమీప బంధువులే.రాజారెడ్డిని నగరంలో ముందుగానే అద్దెకు తీసుకున్న ఓ లాడ్జిలో బంధించి డబ్బు కోసం చితకబాదారు. డబ్బు తెప్పించకుంటే హతమారుస్తామని బెదిరించారు. ఆ సమయంలోనే రాజారెడ్డికి అతడి భార్య నుంచి కూతురికి సీరియస్‌గా ఉందని ఫోన్ వచ్చింది. దీంతో కిడ్నాపర్లు అతడికి భార్యతో మాట్లాడే అవకాశం కల్పించారు. కిడ్నాపర్ల నుంచి ఎలాగోలా తప్పించుకున్న రాజారెడ్డి నగర త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఎస్‌వి.రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునశర్మ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం బళ్లారి, బెంగళూరుల్లో కిడ్నాపర్ల కోసం గాలించారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల ముఠాలోని 9 మందిని అరెస్టు చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సోమవారం నగరంలోని త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నగర డీఎస్పీ మల్లికార్జునశర్మ వివరించారు.