ఆంధ్రప్రదేశ్‌

బ్యారేజీకి చేరుతున్న సాగర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: కృష్ణాడెల్టా ఆయకట్టు పరిధిలో మంచినీటి అవసరాల కోసం ఈ నెల 17న మధ్యాహ్నం నాగార్జునసాగర్ జలాశయం నుంచి విడుదల చేసిన నీరు సోమవారం సాయంత్రం నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. బ్యారేజీకి కనీసం నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు అనుమతినిచ్చిందని తొలుత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అయితే 1.08 టిఎంసిల నీరు విడుదల చేసిన మరుక్షణం అంటే ఈ నెల 20న సాగర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేశారు. అయితే ఇదే సమయంలో తెలంగాణలో 5.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇదిలావుంటే, ఏడాది పొడవునా 12 అడుగుల నీటిమట్టంతో ఉండాల్సిన ప్రకాశం బ్యారేజీ ప్రస్తుతం 4 అడుగుల నీటిమట్టంతో కొనసాగుతోంది.
రోజురోజుకూ తగ్గిపోతున్న సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నుండి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. సోమవారం సాయంత్రానికి సాగర్ నీటిమట్టం 507.20 అడుగులకు చేరుకుంది. ఇది 126.9612 టిఎంసీలకు సమానం. జంట నగరాల వాసులకు మంచినీటి అవసరాల కోసం సాగర్ జలాశయం నుండి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 775 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 18.5410 టిఎంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి సరఫరా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.