ఆంధ్రప్రదేశ్‌

గోదావరి-ఏలేరు నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 23: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రాజెక్టుల మోక్షం కలుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, త్వరలో గోదావరి-ఏలేరు నదులను అనుసంధానిస్తామని చెప్పారు. గతేడాది పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని శ్రీ సూర్యకళామందిరంలో సోమవారం జరిగిన మినీ మహానాడుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018కి పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి-ఏలేరు నదులను అనుసంధానం చేసి ఆయకట్టు పరిధిని గణనీయంగా పెంచుతామన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏలేరు ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రతిపక్ష నేత జగన్ అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డు తగులుతున్నారని విమర్శించారు. పట్టిసీమను సకాలంలో పూర్తిచేసి జగన్ నోరు మూయించామని, పక్క రాష్ట్రాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రం కొనసాగిస్తామని మంత్రి దేవినేని తెలిపారు. ఎన్నికల హామీలన్నిటినీ అమలుచేసిన ప్రభుత్వంగా గుర్తింపు పొందడమే తమ లక్ష్యమన్నారు. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పండుగ వంటిదని, ఈ నెల 27,28,29 తేదీలలో తిరుపతిలో జరిగే మహానాడుకు తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మినీ మహానాడులో భాగంగా వివిధ అంశాలకు సంబంధించి 15 తీర్మానాలు చేసి ఆమోదించారు. దివంగత నేత ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, పోలవరాన్ని 2018లోగా పూర్తిచేయాలని, పెట్రోలియం వర్సిటీ తరలిపోయిన నేపథ్యంలో అటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం, కోనసీమలో శాశ్వత నాఫెడ్ కేంద్రాల ఏర్పాటు, కాకినాడలో సాలిడ్‌వేస్ట్ మేనేజిమెంట్ కేంద్రం, కాకినాడ స్మార్ట్‌సిటీ అభివృద్ధి, సకాలంలో కోనసీమ, కాకినాడ రైల్వేలైన్ల నిర్మాణం వంటి తీర్మానాలను ఆమోదించారు.