ఆంధ్రప్రదేశ్‌

సింహాచలంలో శ్రీచందనం అరగదీత పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మే 3: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక చందనోత్సవాల్లో భాగంగా శ్రీగంధం అరగదీత పనులకు శ్రీకారం చుట్టారు. చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ గంధం అరగదీత ప్రక్రియ మంగళవారం సంప్రదాయంగా ప్రారంభమైంది. నాదస్వర మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ దేవాలయ ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాల కృష్ణమాచార్యులు తొలి గంధపు చెక్కని అరగదీసి శాస్త్రోక్తంగా ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ముఖ్య అర్చకులు సీతారామాచార్యులు, దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్ వరుసగా గంధం అరగదీశారు. ఈ గంధాన్ని అంతరాలయంలో మూలవిరాట్‌కు సమర్పించి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఉద్యోగులు గంధం అరగదీత ప్రక్రియ కొనసాగించారు. శ్రీచందనం అరగదీత పనులతో సింహచలంలో చందనం పరిమళాలు గుబాళించాయి. ముందుగా చందనం చెక్కను శిరస్సుపై ధరించి వైదిక పరివారం బేడా మండపంలో ప్రదక్షిణం చేశారు.

విశ్వక్సేణ ఆరాధన పుణ్యాహవాచనాది వైదికాదికాలు నిర్వహించారు.
తొలి గంధం చెక్కను అరగదీస్తున్న ఆలయ ప్రధానార్చకులు గోపాల కృష్ణమాచార్యులు