ఆంధ్రప్రదేశ్‌

ఈ ఏడాది చివర్లో మున్సిపల్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు, నగర పాలక సంస్థలకు ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులోభాగంగా మంగళవారం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగేనాటికి ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని మంత్రి నారాయణ కోరారు. ముఖ్యంగా రోడ్లు, కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరచాలని కోరారు. ఎన్నికలు జరగని మున్సిపాలిటీల్లో పనులు చేసేందుకు కావల్సినన్ని నిధులు ఇస్తామని నారాయణ వారికి చెప్పారు. క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు.