ఆంధ్రప్రదేశ్‌

మహిళలకు వడ్డీలేని రుణాలు ఏవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రుణాలు ఇవ్వడం లేదని వైకాపా ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి ఆరోపించారు. శాసనసభలో శనివారం డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొంటూ, స్వయం సహాయ గ్రూపుల రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రజలకు టిడిపి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. మహిళా స్వయం సహాయ గ్రూపులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు ప్రస్తుతం అన్ని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 84 లక్షల మహిళా సంఘాలు ఉండగా, 38 లక్షల గ్రూపులకు రుణాలు ఇవ్వలేదన్నారు. బెల్ట్‌షాపులను తొలగిస్తామని ప్రజలకు టిడిపి హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్‌షాపుల సంఖ్య తగ్గకపోగా, మరింత పెరిగిందన్నారు. శ్రీనిధి ద్వారా మహిళలకు లభిస్తున్న రుణాలపై వాణిజ్యబ్యాంకులకంటే వడ్డీ ఎక్కువగా ఉంటోందన్నారు. అడపిల్లలు పుడితే ఆర్థిక సాయం చేసేందుకు ఈ సంవత్సరం నిధులు కేటాయించలేదన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను వేర్వేరు పనులకోసం ఉపయోగించుకుంటున్నారని, ఇది సరైన విధానం కాదని చరితారెడ్డి పేర్కొన్నారు.
మహిళలకు రక్షణ కరవైందని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, బుడిముత్యాలనాయుడు, విష్ణుకుమార్‌రాజు, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.