ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ, ఎస్టీలకు ‘విద్యుత్’ ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఊరట లభిస్తోంది. ఇప్పటి వరకు 50 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తేనే వారికి ఉచిత సౌకర్యం వర్తించేది. 51 యూనిట్లు లేదా అంతకు మించి విద్యుత్తు వినియోగిస్తే మొత్తం బిల్లు లబ్ధిదారులే చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొదటి 50 యూనిట్ల వరకు ఉచిత సదుపాయం ఉంటుంది. అంతకు మించి విద్యుత్తు వినియోగిస్తే అదనపు విద్యుత్తు వినియోగానికి మాత్రమే లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల రాష్ట్రంలోని ఆరులక్షల ఎస్‌సి కటుంబాలకు లబ్ది చేకూరుతుందని, వీరికోసం 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏటా భరిస్తుందని సాంఘికసంక్షేమ మంత్రి కిషోర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 90 వేల మంది గిరిజనులకు లబ్ది చేకూరుతుందని, వీరికోసం ఏటా 16 కోట్ల రూపాయలు ప్రభుత్వ భరిస్తుందని వివరించారు.
మంచినీటి సరఫరా
వేసవిలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంచినీటి సరఫరా శాఖ అధికారులతో శనివారం ఆయన ఇక్కడ సమీక్షించారు. నీటి రవాణాలో అక్రమాలు జరగకుండా జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించారు.