ఆంధ్రప్రదేశ్‌

‘మన నది-మన నుడి’కి జనసేన శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 14: నదులు మన సంస్కృతిలో భాగమని, వాటిని పరిరక్షించుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకృతిని పవిత్రంగా చూసుకుంటే మన జీవన విధానం, ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. పవిత్ర నదులను కాలుష్య రహితంగా కాపాడుకోవాల్సివుందన్నారు. నదులను కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టేనన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో గోదావరి రామపాదాల రేవు వద్ద ‘మన నది-మన నుడి’ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. వేద పండితుల వేద ఘోష నడుమ రామపాదాల రేవులో గోదావరి నదికి శాస్త్రోక్తంగా పవన్
కళ్యాణ్ నీరాజనం పలికారు. మొత్తం 12 రకాల హారతులు నదికి ఇచ్చారు. గోదావరి నదికి పసుపు, కుంకుమతో పూజలుచేసి,. గోదావరి మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు వేద పండితులు పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌లతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నదీ హారతి అనంతరం ప్రజలనుద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నదులకు, చెట్లకు పూజలు చేయడమంటే ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడమేనన్నారు. రాజకీయ పార్టీలు సామాజిక సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించాలని, మన సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి ముందు తెలుగు భాషా పరిరక్షణకు ఉద్దేశించిన ‘మన నుడి’లో భాగంగా విద్యార్థులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు పెద్ద బాలశిక్ష పుస్తకాలను పంపిణీచేశారు. తెలుగు భాష ఔన్నత్యంపై విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల లక్ష్మీదుర్గేష్, పంతం నానాజీ, గంట స్వరూప, పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

*చిత్రం... గోదావరి నదికి హారతిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్