ఆంధ్రప్రదేశ్‌

బాబు యాత్రకు కావాలనే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఫిబ్రవరి 27: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాచైతన్యయాత్రను విశాఖపట్టణంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కావాలనే అడ్డుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముందస్తు అనుమతితోనే చంద్రబాబు ప్రజాచైతన్యయాత్రలో పాల్గొనేందుకు విశాఖపట్టణానికి వెళ్లారన్నారు. అయితే వైకాపా గూండాలు, పెయిడ్ ఆర్టిస్టులు చెప్పులు, గుడ్లు విసిరి నిరసన తెలియజేస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. మూడు రేప్ కేసుల్లో ముద్దాయి అయిన వ్యక్తిని చంద్రబాబు కాన్వాయ్ పక్కనే ఉంచారంటే పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబునాయుడు పర్యటించినప్పుడు ఎలాంటి సమస్య రాలేదన్నారు. అలాంటిది ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకునేందుకు కావాలనే వైకాపా వారు దాడులు చేయించారన్నారు. ఉత్తరాంధ్రకు ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టం చేయాలని లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. పులివెందులకు రూ.3 వేల కోట్లు మంజూరు చేశారని, మిగిలిన ప్రాంతాల్లో ఏం అభివృద్ది చేశారో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలను లేకుండా చేస్తున్నారన్నారు. మూడు రాజధానుల చిచ్చు పెట్టి కులాలు, ప్రాంతాల వారీగా విభేదాలు సృష్టించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారన్నారు. విశాఖపట్టణంవాసులు చాలా తెలివైనవారని, అందుకే అక్కడ విజయమ్మ ఎంపీగా పోటీ చేసినప్పుడు లక్ష ఓట్ల భారీ తేడాతో ఓడించారన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా డీజీపీ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇంతటి అరాచకపాలనను ఎప్పుడూ చూడలేదని, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడుకే ఇలాంటి పరిస్థితి ఎదురయిందంటే ఇక సామాన్యులైన ప్రజాప్రతినిధులు, ప్రజలను ఏ విధంగా ఇబ్బందిపెడతారో అర్థం చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పార్థసారథి, పొలిట్ బ్యూరోసభ్యులు కాలవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్