ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనులకు పీటముడి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి కేంద్రం కోరుతున్న వివరాలతో పీటముడి పడింది. రాష్ట్ర విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో అప్పటి నుండి అయిన ఖర్చులకు సంబంధించి కేంద్రమే నిధులు మంజూరు చేస్తోంది. అయితే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు ఉమ్మడి రాష్ట్రంలో సైతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. నాడు చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలంటూ కేంద్రం ఆదేశించడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం నాటి ఫైళ్లు అన్నీ ఎక్కడ ఉన్నాయో ఎవరికీ అంతుపట్టడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిధులు మంజూరు చేయాలంటే పాత ఖర్చుల వివరాలు తేల్చాల్సిందేననే నిబంధన విధించడంతో పోలవరం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 2014కి పూర్వం రాష్ట్రం తన సొంత నిధులతో ఖర్చు పెట్టిన రూ.5138 కోట్లకు లెక్కలు ఇవ్వనిదే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇంక డబ్బులు ఇచ్చేది లేదని చెప్పినప్పటికీ ఇంత వరకు రాష్ట్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఈ నిధులకు లెక్కలు తేలకపోతే తాజా నిధులు వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ముందుకెళ్ళే అవకాశం కన్పించడంలేదు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేజర్ హెడ్ 120లో 2004-05 బడ్జెట్ నుంచి 2019-2020 వరకు పరిశీలిస్తే అంచనా బడ్జెట్‌లో సుమారు రూ.35,682.87 కోట్లు కేటాయించారు. ఇందులో సుమారు రూ.16,006.81 కోట్లు ఖర్చుచేశారు. నిర్మాణ పనులకు సుమారు రూ.10,255.64 కోట్లు, భూసేకరణకు సుమారు రూ.4904.59 కోట్లు, ఆర్ అండ్ ఆర్‌కు సుమారు రూ.804.11 కోట్లు ఖర్చుచేశారు. ఎస్టాబ్లిష్‌మెంట్‌తో సహా అంచనావేస్తే సుమారు రూ.16,963.02 కోట్లు ఖర్చుచేశారు. జాతీయ ప్రాజెక్టు కాక ముందు 2004-05 నుంచి 2013-14 వరకు రూ.5548 కోట్లు ఖర్చుచేశారు. ఈ ఖర్చులన్నిటికీ లెక్కలు చూపించాల్సిందిగా ప్రస్తుతం కేంద్రం అడుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ గణాంక వివరాలన్నీ ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితివుంది. పోలవరం ప్రాజెక్టు అన్ని పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.16,963.02 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత రూ.11,827.15 కోట్లు ఖర్చయింది. కేంద్రం అధీనంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటి వరకు రూ.8,507.26 కోట్లు మంజూరుచేసింది. ఇంకా రూ.3,319.89 కోట్లు రీయింబర్స్ చేయాల్సివుంది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఇప్పటి వరకు 2017-18, 2018-19 సంవత్సరాలకు గాను రూ.6,752.01 కోట్లకు సంబంధించి 9,706 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమర్పించారు. ప్రస్తుత బడ్జెట్ సంవత్సరంలో 2019-20లో ఫిబ్రవరి 7వ తేదీ వరకు మొత్తం రూ.486.34 కోట్ల విలువైన పనులకు 5,290 బిల్లులు పంపించారు. అయితే 2017-18, 2018-19కి సంబంధించి ఇంకా రూ.101.48 కోట్ల విలువైన పనులకు 34 బిల్లులు సమర్పించాల్సివుంది. అదేవిధంగా ప్రస్తుత బడ్జెట్ సంవత్సరానికి సంబంధించి 2019-20 ఫిబ్రవరి 7వ తేదీ వరకు పరిశీలిస్తే రూ.66.96 కోట్ల విలువైన పనులకు సంబంధించి 17 బిల్లులు సమర్పించడానికి సిద్ధం చేశారు.
ఏదేమైనప్పటికీ జాతీయ ప్రాజెక్టుగా మారిన తర్వాత ఎప్పటికపుడు బిల్లులు ఆలస్యం లేకుండా సమర్పిస్తున్నందున పాత బిల్లులతో లింకు పెట్టకుండా సకాలంలో నిధులు మంజూరు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు ఎనిమిది నెలలుగా నిధుల లేమితో ప్రాజెక్టు పనులు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడంలేదు. పోలవరానికయ్యే ప్రతీ పైసా కేంద్రమే భరించాల్సిన తరుణంలో పూర్వం నిధులకు లెక్కలకు ముడి పెట్టడం ఎంతవరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది. కొసమెరుపు ఏమిటంటే ఇటీవల రీయింబర్స్‌మెంట్‌గా ఇచ్చిన సుమారు రూ.1800 కోట్ల నిధులు ఇతర పథకాలకు దారి మళ్ళాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే ఆ నిధులు ఏ ఖాతాలోకి వెళ్లాయో తేలాల్సి వుంది.