ఆంధ్రప్రదేశ్‌

72వ రోజుకు రాజధాని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 27: ఐదు కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి కేంద్రబిందువుగా విరాజిల్లుతుందన్న విశ్వాసంతో తమ భూములను అప్పగిస్తే, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం, అమరావతి తరలింపు ప్రకటనతో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెనక్కు తీసుకోవాలంటూ నిరసనలు, ఆందోళనలు, దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలతో 29 గ్రామాల్లో సాగుతున్న ఆందోళన గురువారం 72వ రోజుకు చేరుకుంది.
వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులు, మహిళలు ప్రభుత్వం స్పందించి అమరావతినే రాష్ట్ర రాజధానిగా ప్రకటించే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, తాడికొండ అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లో రిలే, 24 గంటల దీక్షలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుళ్లూరు దీక్షా శిబిరంలో బీసీ సామాజికవర్గానికి చెందిన రైతులు పాల్గొన్నారు. రాయపూడి దీక్షా శిబిరంలో ముఖానికి నల్ల కవర్లు ధరించి మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రగతికి విఘాతం, అమరావతితోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమంటూ వినూత్న రీతుల్లో నిరసనలు తెలియజేశారు. వెలగపూడి గ్రామంలో సాయిబాబా భజనలు చేస్తూ మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పెదపరిమి, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు తమ సంపూర్ణ సంఘీభావం తెలిపారు. 70 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని వంగవీటి మండిపడ్డారు. రైతుల ఉద్యమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని, వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని సూచించారు. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, జేఏసి నాయకులు రాజధాని గ్రామాలైన తుళ్లూరు, వెలగపూడి మందడం గ్రామాలను సందర్శించి రైతులకు తమ మద్దతు తెలియజేశారు. తులసిరెడ్డి మాట్లాడుతూ ఇది 29 గ్రామాల సమస్య కాదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల సమస్య అన్నారు. విశాఖపట్నం ప్రజలు కూడా అమరావతే రాజధాని అని చెప్తున్నారన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కృష్ణాయపాలెంలో రైతులు రోడ్లపైకి చేరుకుని హైకోర్టు న్యాయమూర్తులు, ప్రయాణికులకు నమస్కారాలు చేస్తూ తమ నిరసనలు కొనసాగించారు.