ఆంధ్రప్రదేశ్‌

జూలై 8 నుంచి వైఎస్సార్ చిరునవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యం అందించేందుకు జూలై 8 నుంచి వైఎస్సార్ చిరునవ్వు పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కింద 60 లక్షల మంది చిన్నారులకు దంత పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశాఖపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత దంత వైద్యాన్ని ఈ పథకం కింద అందచేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి విద్యార్థికి ఒక టూత్ పేస్టు, బ్రష్ ఉచితంగా అందచేయాలన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో పరిశీంచి, ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ పథకానికి అడ్డంకులు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని కోరారు. రెండు వేల జనాభా ఒక యూనిట్‌గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలన్నారు. ఏ సేవ అయినా డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విలేజ్ క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ స్ట్ఫా 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ఎక్కడ ఉందో అక్కడే ఈ క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇవి ఒక రిఫరల్ పాయింట్‌లా ఉండాలన్నారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్‌లా ఉండాలన్నారు. రోగికి ఏదైనా
జరిగితే వెంటనే అక్కడికి వెళ్తే, ఉచితంగా వైద్యం అందుతుందనే విధంగా ఆ క్లినిక్‌లు ఉండాలన్నారు. డబ్బు ఖర్చు కాకుండా ఉచితంగా వైద్యం అందాలన్నారు. రూపాయి ఖర్చు లేకుండా బేసిక్ మెడికేషన్ అక్కడ లభించాలన్నారు. చిన్న చిన్న సమస్యలకు అక్కడిక్కడే చికిత్స, మందులు లభించాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక బోధనాసుపత్రి ఉండాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖ సేవలు ఉండాలని సూచించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 బోధనాసుపత్రులు ఉండాలన్నారు. 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. బోధనాసుపత్రులకు అవసరమైన వౌలిక సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. డాక్టర్లు, నర్సుల కొరతను జిల్లాకు ఒక టీచింగ్ ఆసుపత్రి ఉంటే అధిగమించవచ్చన్నారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలన్నారు. అవ్వాతాతలకు కళ్లద్దాలు ఇస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...ఆరోగ్య శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి