ఆంధ్రప్రదేశ్‌

‘లోగో’ ఆవిష్కరణతో లేపాక్షి ఉత్సవాలకు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 26: ఘన చరిత్ర కలిగిన అనంతపురం జల్లాలోని లేపాక్షి ప్రాధాన్యతను తెలియజేస్తూ నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి ‘లేపాక్షి వైభవం-2020’ పేరుతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక లోగోను రూపొందించింది. లేపాక్షి చరిత్రను ప్రతిబింబిస్తూ విభిన్న రంగుల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన ఈ లోగోను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం ఆవిష్కరించి ఉత్సవాలకు నాంది పలికారు. మార్చి 7, 8 తేదీల్లో రెండురోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషియల్ మీడియాను వాడుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్..జగన్‌మోహన్‌రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ చారిత్రక, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడానికి, వాటికి బహుళ ప్రాచుర్యం కల్పించడానికి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్సవాలను నిర్వహిస్తూ విస్తృత ప్రచారానికి తోడ్పాటునందిస్తోందన్నారు. ఈ క్రమంలో లేపాక్షి ఉత్సవాలకు చేయూతనిస్తోందని అన్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి విడుదల చేయగా, సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. లేపాక్షి ఉత్సవాలకు ఈసారి ఆధునికత, స్థానిక చారిత్రకతను మేళవించి నేటి పరిస్థితులు, ప్రజల అభిరుచికి అనుగుణంగా, నాటి, నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా రెండు రోజుల కార్యక్రమాలు రూపొందించామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లోనూ లేపాక్షి ఉత్సవాల వైభవాన్ని తెలిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లా, రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించామన్నారు. అలాగే లేపాక్షి ఉత్సవాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన ఓ వీడియోను కలెక్టర్ లాంఛణంగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
*చిత్రం... అనంతపురంలో లేపాక్షి ఉత్సవాల లోగోను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ గంధం చంద్రుడు