ఆంధ్రప్రదేశ్‌

రాజధాని అమరావతి మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: రాజధాని అమరావతి మార్పు నిర్ణయాన్ని సీఎం జగన్ ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ విభాగం ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో బుధవారం చేపట్టిన 24 గంటల దీక్షను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దీక్షలో పాల్గొన్న మహిళలను సీపీఐ తరపున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని విషయమై రైతులు, మహిళలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా జగన్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. రాజధాని మార్పుపై తన నిర్ణయం సరైందో, కాదో స్పష్టం చేయకపోవడం, చర్చలకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే అమరావతి అవసరం లేదు.. రాజధానిని విశాఖలోనే పెడతానని ప్రకటన చేయాలన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎంపీ నందిగం సురేష్ రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారంటే మహిళలు తొలి విజయం సాధించినట్లే అన్నారు. జగన్‌కు దమ్ముంటే పోలీస్ బందోబస్తు లేకుండా తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లాలన్నారు. అత్యధికంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను కలిగి ఉండడమే కాకుండా గత చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం 54వేల ఎకరాలను సమీకరించినందున జగన్ దర్జాగా పరిపాలన సాగించవచ్చన్నారు. రాజధాని మార్పు నిర్ణయం వల్ల జగన్ ఉద్యమకారులకు భయపడి 2వేల మంది పోలీసు బందోబస్తు మధ్య డమీ కాన్వాయ్ తిరిగి వచ్చిన తర్వాత అసలు కాన్వాయ్‌లో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.