ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌పీఆర్‌పై తీర్మానం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయబోమంటూ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించాలంటూ పీసీసీ నూతన కార్యవర్గ తొలి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. దేశ ప్రజలను అభద్రతాభావంలోకి తీసుకువెళ్లే సీఏఏ, ఎన్‌పీఆర్‌లను అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లోనూ, అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని సమావేశం డిమాండ్ చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీకి నాయకత్వం వహించిన రఘువీరారెడ్డికి అభినందనలు తెలుపుతూ విద్యావంతుడు, యువకుడు, సమర్థుడు, దళిత నాయకుడు డాక్టర్ శైలజానాథ్‌ను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా చేసినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నాయకుడు రాహుల్‌గాంధీలకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక తీర్మానం ఆమోదించింది. న్యూఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో మృతులకు సంతాపాన్ని సమావేశం తెలియజేసింది. ఈ సమావేశంలో మొత్తం ఐదు తీర్మానాలు చేసినట్లు కార్య నిర్వాహక అధ్యక్షులు తులసీరెడ్డి, మస్తాన్‌వలీ వివరించారు. ఈ తీర్మానాలను వర్కింగ్ ప్రెసెడెంట్లతో పాటు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు చింతా మోహన్, కేవీపీ రామచంద్రరావు మీడియాకు వివరించారు. కాంగ్రెస్ రాష్ట్ర నూతన కమిటీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ, కార్యదర్శులు మెయ్యప్పన్ క్రిష్ట్ఫోర్, పీసీసీ అధ్యక్షులు శైలజానాధ్, ఏఐసీసీ కార్యదర్శులు కొప్పల రాజు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సిరివెళ్ల ప్రసాద్, పల్లం రాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణీకుమారి, సమన్వయ కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, నగర అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరో నాలుగు అంశాలపై చర్చ జరిగినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు వివరించారు. రాజధాని విషయంలో గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసాయన్నారు. అమరావతిని అంగీకరిస్తూ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశాడన్నారు. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులంటున్నాడని అన్నారు. మార్చి 20తేదీ లోపు జిల్లా, మండల కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉమెర్ చాందీ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛాలెంజ్‌గా స్వీకరించి ముందుకు దూకాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, బలోపేతానికి చేపట్టే చర్యల గురించి కొప్పుల రాజు, పల్లంరాజు, కేవీపీ, కిష్ట్ఫోర్, మెయ్యప్పన్, జేడీ శీలం, చింతామోహన్ ప్రసంగించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అధ్యక్షత వహించారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్