ఆంధ్రప్రదేశ్‌

హుదూద్ గృహాల ప్రారంభోత్సవానికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: విశాఖపట్నంలో హుదూద్ బాధితులకు తెలుగు సినీ పరిశ్రమ సహకారంతో నిర్మించిన గృహాలను ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సినీ ప్రముఖులు ఆహ్వానించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ నిర్మాతలు డీ సురేష్‌బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు ముఖ్యమంత్రితో కొద్దిసేపు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సినీ ప్రతినిధుల బృందం మీడియాతో మాట్లాడుతూ హుదూద్ తుపానులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సినీ పరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినందున వాటిని ప్రారంభించాలని కోరామన్నారు. హుదూద్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని గుర్తుచేశారు. ఈ షో ద్వారా వసూలైన రూ. 15 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని వివరించారు. ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్‌కు సినీ ప్రముఖుల ఆహ్వానం