ఆంధ్రప్రదేశ్‌

ఇంధన ఎగుమతి పాలిసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: విద్యుత్ రంగంలో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీపై అధికారులు దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలనుకునే కంపెనీలు, సంస్థలకు అనుకూలంగా నూతన విధానాన్ని అమల్లోకి తీసుకు రావాలని నిర్దేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్లాంట్లు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులకు సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీకి రూపకల్పన జరగాలన్నారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. దీనివల్ల భూములిచ్చే వారికి మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఏటా రైతులకు ఆదాయం వస్తుందని భూమిపై హక్కులు మాత్రం ఎప్పటికీ వారికే ఉంటాయని స్పష్టం
చేశారు. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఎన్టీటీపీసీ ముందుకు వస్తోందని అధికారులు వివరించారు. దీనికి అవసరమైన భూములు అందించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరలో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణం విధి విధానాలపై ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యవసాయానికి 9 గంటలతో పాటు నిరంతర విద్యుత్ కోసం ఫీడర్ల ఆటోమేషన్ ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. వచ్చే రెండేళ్లలో ఆటోమేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

*చిత్రం...విద్యుత్ రంగంపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి