ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: పోలవరం డ్యామ్ పరిధిలో ఉన్న ఏడు గ్రామాల నిర్వాసితులకు ఆర్.ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి ఖచ్చితంగా ప్రభుత్వం అందిస్తుందని, ఎవరికీ అన్యాయం చేసే అవకాశం లేదని రాష్ట్ర జలవనరుల నిర్వహణ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ నిర్వాసితులకు మార్కెట్ విలువకు మూడు రెట్లు మొత్తం మంజూరు చేసి, వారికి నచ్చచెప్పి ఖాళీ చేయిస్తున్నాము తప్ప ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించడం లేదని అన్నారు. మంత్రి చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఆర్.ఆర్ ప్యాకేజీ ఇంతవరకు నిర్వాసితులుకు అందకపోవడం వల్ల ధర్నాలు, ఆందోళనలు నిత్యం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ వారికి ఇచ్చి సంతృప్తిగా వారిని తరలించడంతో పనులు చేపట్టడం మంచి పరిణామం తప్ప తాను గానీ, అక్కడ ఉన్న వారెవరూ పోలవరం ప్రాజెక్టు పనులకు వ్యతిరేకం కాదని చెప్పారు. అక్కడ ఉన్న గిరిజనుల కష్టాలను గుర్తించండి, సుమారు 1.40 లక్షల మంది నిర్వాసితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఇందుకు మంత్రి వివరణ ఇస్తూ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం పోలవరం ముంపు ప్రాంతంలో ప్రాజెక్టు వల్ల నష్టపోయిన 38,985 కుటుంబాలను గుర్తించినట్లు చెప్పారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు కోసం 45,743 ఎకరాల విస్తీర్ణం మేరకు భూ సేకరణ చేసినట్లు చెప్పారు. ముంపునకు గురయ్యే 1,497 ఎకరాల ప్రాంతాన్ని సేకరించామని, ఈ నిర్వాసితులుకు ప్రత్యామ్నాయంగా భూమికి భూమిని సమకూర్చడానికి 297 ఎకరాల కోసం ప్రకటనలను జారీ చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ప్రాజెక్టు నిర్వహణదారులను ఆదేశించినట్లు చెప్పారు.