ఆంధ్రప్రదేశ్‌

మార్చి 1 నాటికి దిశ పోలీస్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 25: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1వ తేదీ కల్లా దిశ పోలీస్ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్పందనపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల ఎస్పీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్, మహిళా మిత్రల సేవలు వినియోగించు కోవాలన్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు, అక్రమ మద్యం తయారీ, ఇంకా ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై మహిళా పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలో బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత జిల్లా ఎస్పీలకు తగిన సంకేతాలు పంపాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. అక్రమ మద్యం, బెల్ట్‌షాపుల నియంత్రణకు చేసిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, నేరగాళ్లకు భయం పుట్టేలా వారి భరతం పట్టాలని స్పష్టం చేశారు. మహిళా పోలీసుల నుంచి ఎస్పీలతో పాటు ప్రత్యేక బృందాలకు ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. పోలీసులు మహిళామిత్ర వ్యవస్థను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన విషయంలో సత్వర తీర్పు వెలువడిన విషయాన్ని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. పోలీసులు శరవేగంతో పనిచేసి చార్జిషీట్ దాఖలు చేశారని, గట్టి ఆధారాలతో కోర్టు ముందుంచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ను సీఎం అభినందించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నిని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్పందనకు జిల్లాల్లో వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరిలో విద్యుత్ కోతపై, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో తాగునీటి సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయని సత్వరమే వీటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి