ఆంధ్రప్రదేశ్‌

జైళ్లలో తమిళనాడు తరహా సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జైళ్లలో తమిళనాడు తరహా సంస్కరణలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జైళ్ల శాఖ ఐజీ మహ్మద్ అషాన్ రిజా తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దీనిపై ఒక నివేదిక సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వివిధ నేరాల్లో శిక్ష అనుభవించి, తిరిగి బయటకు వెళ్లిన తరువాత వారు తమ ప్రవృత్తిని మార్చుకునే విధంగా సంస్కరణలను అమలు చేయనున్నట్టు తెలిపారు. శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడుతున్న సంఘటనపై జరిగిన అధ్యయనంలో వీరంతా ఉపాధి లభించక, ఇతర కారణాల రీత్యా తిరిగి తమ పాత ప్రవృత్తినే కొనసాగించే అవకావం ఉందన్నారు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా శిక్షా కాలంలోనే వారికి వివిధ అంశాల్లో శిక్షణనివ్వడం, విడుదల అనంతరం స్వయం ఉపాధి లేనిపక్షంలో ఇతర ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా సంస్కరణలు అమలు చేయనున్నట్టు వెల్లడించారు. దీనితో పాటు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ కుటుంబీకులతో కలుసుకోవడం, బాంధవ్యాలపై వారి దృష్టి మళ్లించేందుకు ప్రత్యేక రోజుల్లో కుటుంబసభ్యులతో గడిపితే మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. జైళ్లలో శిక్ష అనుభవించే కాలం వీరికి పరివర్తన కలిగేలా సంస్కరణలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఐఫ్యూచర్ గ్లోబస్టిక్ ఎంటర్ ప్రైజస్ సంస్థ సమకూర్చిన రూ.38 లక్షల విలువైన స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. పసుపు, కారం వంటి వాటిని ఇక్కడ గ్రైండ్ చేసి రిటైల్‌గా విక్రయించనున్నారు.