ఆంధ్రప్రదేశ్‌

అనంత సంస్కృతికి అద్దం పట్టేలా లేపాక్షి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 24: ఘనమైన చారిత్రక నేపథ్యం, శిల్ప కళలకు పెట్టింది పేరైన లేపాక్షి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శిల్ప కళా నిలయంగా విరాజిల్లుతున్న లేపాక్షి ఘనచరిత్రను నలుదిశగా చాటేలా ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 19, మార్చి 1వ తేదీ రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో ఉత్సవ కమిటీలు, నిర్వాహకులను నియమించారు. ఎంపికచేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి వ్యయం చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి అనుమతి లభించింది. కూడిపూడి, భరత నాట్యం, కథాకళి తదితర నృత్యరీతులతో పాటు గ్రామీణ కళలు, గ్రామీణ క్రీడలకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించారు. ఈ అంశాలను ప్రతిబింబించేలా ‘లోగో’ను ప్రత్యేకంగా రూపొందించడంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టర్ గంధం చంద్రుడు తనదైన ముద్ర వేసుకునేలా ఉత్సవాల నిర్వహణకు పూనుకున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. లేపాక్షి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు.