ఆంధ్రప్రదేశ్‌

క్రీడారత్నాలను వెలికితీయడమే సీఎం కప్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, ఫిబ్రవరి 22: గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడారత్నాలను వెలికితీయడమే సిఎం కప్ లక్ష్యమని రాష్ట్ర క్రీడలశాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం సిఎం కప్ రాష్టస్థ్రాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలను ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై ఎస్.జగన్మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక క్రీడారంగానికి పెద్ద పీట వేశారన్నారు. క్రీడల పట్ల తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను చదువుకే పరిమితం చేసి వారిపై వత్తిడి తీసుకురాకుడదని ఆయన సూచించారు. గత ప్రభుత్వం క్రీడల పట్ల చిన్నచూపు చూసిందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మంచి క్రీడాకారుడని, అందుకే ఆయన బడ్జెట్‌లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతిభా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా 2కోట్ల రూపాయలు అందించామని మంత్రి వెల్లడించారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించిన క్రీడాకారులకు 5లక్షల రూపాయలు, సిల్వర్‌మెడ్ గ్రహీతలకు 2లక్షలు, కాంస్యపతకాన్ని పొందేవారికి 1లక్ష రూపాయల వంతున అందజేస్తామని ఆయన తెలిపారు. పొదలకూరులో అసంపూర్తిగా ఉన్న మినీస్టేడియంను అన్నీ సౌకర్యాలతో పూర్తిచేసి ఆ స్టేడియంకు 12 ఎకరాలను విరాళమిచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి పేరు పెడతామన్నారు. వచ్చే బడ్జెట్‌లో మినీ స్టేడియంల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అట్టహాసంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
సిఎం కప్ రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో శనివారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర క్రీడామంత్రి అవంతి శ్రీనివాస్ ఈపోటీలను ప్రారంభించారు. తొలుత ఆయన క్రీడా ప్రాంగణంలోని జాతీయ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లాలనుండి వచ్చిన క్రీడాకారులనుండి ఆయన గౌరవవందనం స్వీకరించారు. బెలూన్లను ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి వచ్చిన క్రీడాకారులు, క్రీడాసంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, అంఫైర్లతో క్రీడామైదానం కోలాహలంగా మారింది. వివిద జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకున్నారు. మంత్రిని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాదురావు, కావలి, గూడూరు ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వరప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబు, శాప్ డిడి ఎస్.వి.రమణ, సెట్నెల్ సియివో సుస్మితారెడ్డి, క్రీడాప్రాధికారసంస్థ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభసభలో బెలూన్లు ఎగురవేస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ శేషగిరిబాబు తదితరులు