ఆంధ్రప్రదేశ్‌

నన్ను ప్రజలే కాపాడుకొంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 19: రాష్ట్ర రాజధాని అమరావతి, బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పట్టించుకోవటం లేదని తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చేపట్టిన ప్రజాచైతన్యయాత్రకు పార్టీశ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. చీరాల డివిజన్‌లోని బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. ఎవరైనా మూడు రాజధానులు కావాలని అడిగారా? అని నిలదీశారు. అమరావతిపై
ఎందుకు ఇంత కక్ష అని అమరావతి రాజధాని కోసం 29వేల మంది రైతులు రోడ్లపైకి వచ్చి 60రోజులుగా పోరాడుతున్నారని, రైతులు ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. అమ్మఒడి పథకం ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఒకరే అంటున్నారని ఆయన ఆరోపించారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, నీతి నిజాయితీతో ఉన్నా, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశానని ఆయన చెప్పారు. తన కుటుంబంకోసం, తన వారి కోసం ఎక్కడ తప్పుచేయలేదని ఆయన అన్నారు. తన భద్రతను కుదించే యత్నం చేస్తున్నారని, తనను ప్రజలే కాపాడుకుంటారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరడంతో ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారని, ప్రస్తుతం ప్రజలు ఓటు ఎందుకు వేశామా? అని బాధపడతున్నారని బాబు అభిప్రాయపడ్డారు.టీడీపీ నేతలు,కార్యకర్తలను అధికార పార్టీ నేతలు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జగన్ రాష్టభ్రవిష్యత్తును నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్, రేషన్‌తోపాటు అన్నింటిలోను కోతలు కోసుకుంటూ ప్రభుత్వం వెళ్తోందని, ఉపకార వేతనాలు, నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంనుండి 1.80లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని, అదాని, రియలన్స్, లూలూ సంస్ధలు ఎందుకు వెళ్లిపోయాయని ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కియాను బెదిరిస్తే వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. పెట్టుబడులు రాకుండా ఉద్యోగాలు పోతే స్ధానికులకు 75శాతం రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వమని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చామని, కాని వైసీపీ ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. పీపీఏలను రద్దుచేశారని, సోలార్ విండ్‌ను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. చివరకు ప్రజలు చొక్కా వేసుకున్నా పన్నువేసేలా ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. తాను అధికారం కోసం ఇక్కడి రాలేదని, అధికారం తనకు కొత్త కాదని , తొమ్మిదినెలల్లో రాష్ట్ర పరిస్ధితి ఏవిధంగా ఉందో ప్రజలే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తమప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులపై కావాలని, సీబీఐ, ఏసీబీని పురమాయించి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గ్రానైట్ క్వారీలు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, గుంటూరు జిల్లాకుచెందిన మరో శాసనసభ్యులు వైసీపీలోకి రావాలని ఒత్తిడి తీసుకువచ్చారని, వాటికి తలొగ్గకపోవటంతోనే ఫెనాల్టీల కత్తిపెట్టారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయని, కాని ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తిఅవుతుందో తెలియని పరిస్ధితిలో ఉందన్నారు. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు,శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు,కరణం బలరాం,గొట్టిపాటి రవికుమార్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... మార్టూరు బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు