ఆంధ్రప్రదేశ్‌

కంపెనీల స్థలాలను తీసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటు నిమిత్తం రుషికొండ ఐటీ సెజ్‌లో సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలోని రుషికొండ ఐటీ సెజ్‌లను జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి బుధవారం సందర్శించిన ఆయన ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఐటీ సంస్థల భవనాలను ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఐటీ సంస్థల ఏర్పాటు కోసమే మిలీనియం టవర్ బీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.7 కోట్లు కేటాయించిందన్నారు. మిలినియం టవర్స్‌లో ప్రస్తుతం ఉన్న కాండ్యుయెంట్ సంస్థ విస్తరణ నిమిత్తం అనుమతి కోరిందన్నారు. ఇదే ప్రాంతంలో మరో లక్ష చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం అందుబాటులో ఉందని, దీన్ని కేటాయిస్తామన్నారు. అదానీ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి మూడు
నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టలేమని స్పష్టంగా చెప్పినప్పటికీ గత రూ.70వేల కోట్ల పెట్టుబడులు అంటూ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. అదానీ డేటా సెంటర్ తప్పకుండా విశాఖలో ఏర్పాటవుతుందని, అందుకు 80 ఎకరాల స్థలం చాలని చెప్పారన్నారు. అయితే అదానికి ఇచ్చిన స్థలం ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగించాలని భావించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలం చూశారన్నారు. పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం కొంతమేర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని మంత్రి మేకపాటి అన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు అనేక అంశాలను ప్రస్తావించారని, వాటిని పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఏడాది కాలంలో 50వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మిలీనియం టవర్స్‌కు నిధులు కేటాయిస్తే ఈ భవనాన్ని రాజధాని కోసం తీసుకుంటున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. ఉత్తరాంధ్రలో 45 వరకూ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, ఇక్కడ చదువుకున్న పట్ట్భద్రులకు స్థానికంగా ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని కోరినట్టు తెలిపారు. ఐటీ సంస్థలకు అవసరమైన నిపుణులను ఇక్కడే తయారు చేసుకోవచ్చన్నారు.
*చిత్రం... విశాఖ రుషికొండలోని ఐటీ సెజ్‌లో ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి