ఆంధ్రప్రదేశ్‌

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శుభవార్త. కాలుష్య రహిత పరిశ్రమలు ఇక మీదట ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అనుమతి లేదా ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రిక్, సీఎఫ్‌ఎల్ బల్బులు (అసెంబ్లింగ్ మాత్రమే), మెడికల్ ఆక్సిజన్, ప్లాస్టిక్ కాటన్‌తో తయారయ్యే తాళ్లు, ఫ్లైయాష్ ఇటుకల తయారీ వంటి కాలుష్యాన్ని వెదజల్లని పరిశ్రమలు ఇక మీదట ఏపీపీసీబీ అనుమతి పొందాల్సిన అవసరం లేదు. మండలికి కేవలం సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే ఆన్‌లైన్ విధానాన్ని (ఆన్‌లైన్ కనె్సంట్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం) ప్రవేశపెట్టింది. ఇక మీదట ఆ తరహా పరిశ్రమలు మొత్తం సమాచారాన్ని దరఖాస్తు ఆన్‌లైన్‌లో పంపగానే రసీదు వచ్చేస్తుంది. ఈ రసీదే కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో సమానమని ఏపీపీసీబీ సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ తెలిపారు.