ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులను పంచాయతీరాజ్, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఏపీఎండీసీ అధికారులతో నూతన ఇసుక పాలసీ, డోర్ డెలివరీ విధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీఎండీసీ వీసీ, ఎండీ మధుసూదన్‌రెడ్డి పలువురు మైనింగ్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఇప్పటికే 380 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, మరో వంద మొబైల్ చెకింగ్ పార్టీలను కూడా నియమించామని తెలిపారు. ఇసుక నిజమైన లబ్ధిదారుడికి మాత్రమే అందాలని, అందుకు భిన్నంగా జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు చేరవేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక పాలసీని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ విధానాన్ని జీపీఎస్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఇసుక విక్రయాలు, రవాణాలో అక్రమాలకు ముకుతాడు వేశామన్నారు. దీనికి అనుబంధంగా ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా రూపొందించాలని, మొబైల్ బృందాల పనితీరును కూడా ఈ యాప్ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి చెక్‌పోస్టు పనితీరును నెలలో రెండుసార్లు సమీక్షించాలని, సంబంధిత
రికార్డులు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ రికార్డులను ఏపీఎండీసీకి అనుసంధానం చేయాలన్నారు. నూతనంగా రూపొందించే యాప్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకుంటే వెంటనే ఆ వివరాలు ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయానికి మెసేజ్ రూపంలో చేరవేయాలని వివరించారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇసుక డోర్ డెలివరీ విధానాన్ని విజయవంతంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. గత నెల 2వ తేదీన పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ విధానం ద్వారా కృష్ణాజిల్లాలో ప్రస్తుతం 95 శాతం వరకు వినియోగదారులకు ఇసుకను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. నూరుశాతం అమల్లోకి తేవాలని మంత్రి నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 జిల్లాల్లో కొనసాగుతున్న డోర్ డెలివరీ మిగిలిన నాలుగు జిల్లాలకు విస్తరింప చేయాలన్నారు. మార్చి 31వ తేదీలోగా డోర్ డెలివరీ విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకు రావాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా డిపోల వారీగా ఇసుక నిల్వలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షించారు. జిల్లాల వారీగా ఇసుక స్టాక్ పాయింట్లలో ఏ మేరకు అందుబాటులో ఉందీ అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇసుక లభ్యతలేని జిల్లాలకు స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేసి దగ్గరలోని రీచ్‌ల నుంచి ఇసుకను తరలించాలని ఆదేశించారు. ఏపీఎండీసీలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది పనిచేస్తున్నా ఇంకా ఖాళీగా ఉన్న పోస్ట్‌లకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల సిబ్బందిని నియమించాలని, ప్రతి జిల్లాలో జిల్లా అధికార ప్రతినిధిగా మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

*చిత్రం...పంచాయతీరాజ్, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి