ఆంధ్రప్రదేశ్‌

ఆ మూడు రోగాలకూ చికిత్స లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం మెచ్చుకునేలా తాము పాలన సాగిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నాయకులు కడుపుమంటతో తమపై లేనేపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ నాయకులకు ఎక్కడలేని రోగాలు ఉన్నాయని, వాటికి ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదని అన్నారు. కర్నూలులో మంగళవారం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయు డు, ఆ పార్టీ నాయకులు కడుపు మంటతో ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స చేస్తున్నాం..ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌కైనా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది గానీ ఆసూయతో పుట్టే కడుపుమంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదన్నారు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది గానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడా చికిత్స లేనే లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి గానీ మె దడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను..మహానుభావులుగా చూపించే కొన్ని ఛానళ్లు, పత్రికలు ఉన్నాయని, వాళ్లను బాగుచేసే మందులూ ఎక్కడా లేవని సీఎం జగన్ అన్నారు.