ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలో క్షీణిస్తున్న నీటి లభ్యత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: పరీవాహక ప్రాంతంలో ఎండల తీవ్రత క్రమేణా పెరుగుతుండటంతోల్ల గోదావరి నదిలో నీటి లభ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. దీంతో రబీ అవసరాలకు సీలేరు నుంచి అదనపు జలాలను తీసుకుంటున్నారు. సోమవారం నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల మేరకు సీలేరు నుంచి అదనపు జలాలను గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఇప్పటి వరకు సీలేరులో పవర్ జనరేషన్ కాకుండా నేరుగా 1200 క్యూసెక్కుల జలాలు గోదావరి నదిలో కలిపేవారు. సోమవారం నుంచి ఈ 1200 క్యూసెక్కులు కాకుండా అదనంగా మరో 1500 క్యూసెక్కుల జలాలు బైపాస్ అంటే జనరేషన్‌తో సంబంధం లేకుండా నదిలోకి వదులుతున్నారు. ఇప్పటి వరకు రోజుకు విడిచి పెట్టే 1200 క్యూసెక్కులతో పాటు సీలేరు పవర్ జనరేషన్ తర్వాత విడుదల చేసే జలాలు సుమారు 3000 క్యూసెక్కులు వెరసి సరాసరిన 4200 క్యూసెక్కులు గోదావరి నదిలో కలిశాయి. ఇపుడు అదనంగా తీసుకుంటోన్న 1500 క్యూసెక్కులతో సుమారు 5700 క్యూసెక్కుల వరకు సీలేరు జలాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఇప్పటి వరకు సీలేరు నుంచి రబీ 2019-2020 సీజన్ మొదలైన డిసెంబర్ ఒకటో తేదీ నుంచి గోదావరి నదిలో 30 టీఎంసీల వరకు వినియోగించారు. రబీ ప్రారంభమైనప్పటి నుంచి గోదావరి నది నుంచి సాగునీటి కాల్వలకు మొత్తం 62 టీఎంసీలు విడుదలచేశారు. అందులో 30 టీఎంసీలు సీలేరు జలాలు పోను మిగిలిన 32 టీఎంసీలు గోదావరి
నదిలో సహజంగా లభించిన నీరు. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో నీటి లభ్యత క్షీణిస్తోంది. దీంతో రబీని గట్టెక్కించడానికి సీలేరు అదనపు జలాలపై ఆధారపడుతున్నారు. ఈ నెలాఖరు నుంచి రబీ నీటి అవసరాలు మరింతగా పెరిగే అవకాశం వుంది. ఎందుకంటే వరి చేలకు చిరుపొట్ట దశ నుంచి పొట్ట దశలో సాగునీటిని అధికంగా అందించాల్సి ఉంటుంది. ఈ దశలో అదనంగా సరఫరా చేయాల్సివుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ వరి సుమారు 8.96 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి విడుదలను పెంచాల్సివుంది. ఈ నెలాఖరుకు నీటి అవసరాలు పెరుగుతాయి, దీనికి తోడు నీటి లభ్యత కూడా తగ్గే అవకాశంవుంది. రబీ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం వంతుల వారీ విధానాన్ని అనుసరించి గోదావరి జలాలను వినియోగించే ప్రక్రియ మూడు డెల్టాల్లో అమలవుతోంది. శివారు ప్రాంతాల భూములకు నీటిని అందించాలంటే వంతుల వారీ విధానం అనివార్యంగా వుంది. అవసరమైతే మోటార్లు పెట్టి కూడా నీటిని తోడుకుని నీటిని వినియోగించాల్సివుంది. డిసెంబర్ మాసంలో ఒకసారి గోదావరి నదిలో నీటి లభ్యత క్షీణించడంతో సీలేరు నుంచి అదనపు నీటిని తీసుకున్నారు. ఇపుడు మళ్ళీ సోమవారం నుంచి 1500 క్యూసెక్కులు అదనంగా తీసుకోవడం ప్రారంభమైంది. సోమవారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం 12.71 మీటర్లు వుంది. బ్యారేజి నుంచి తూర్పు డెల్టాకు 2300 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4100 క్యూసెక్కులు వెరసి 7900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక వైపు ఎండలు పెరుగుతుండటంతో నదిలో నీటి ఆవరి శాతం పెరుగుతోంది. ఇప్పటి వరకు 100 డ్యూటీపై నీటిని సరఫరా చేయగా, మార్చి మొదటి నుంచి 115 డ్యూటీపై సరఫరా చేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
*చిత్రం... గోదావరి నది ప్రస్తుత ద శ్యం