ఆంధ్రప్రదేశ్‌

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పార్టీలకు తమ స్వప్రయోజనాలే పరమావధిగా మారాయని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని బీజేపీ నేత దగ్గుబాటి పురంధ్రీశ్వరి విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని తరలింపు, మండలి రద్దు, విద్యుత్ పీపీఏల రద్దు, పోలవరం టెండర్లు రద్దుచేసి, రివర్స్ టెండర్లు పిలవడం తదితర అంశాలను చూస్తే వైసీపీ ప్రభుత్వానికి ప్రజాహితంపై శ్రద్ధ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మండలిని రద్దు చేస్తామని తొలి సమావేశాల్లోనే ఎందుకు చెప్పలేదన్నారు. రాజధాని తరలింపునకు అడ్డం వస్తోందనే మండలిని రద్దు చేయాలని నిర్ణయించడం తగదన్నారు. వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వెళుతోందన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని సత్తా చాటుతామన్నారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని ప్రజలకు వివరిస్తామన్నారు. తమ పార్టీకి జనసేన మినహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతర్గత సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను కూడా సమీక్షిస్తామన్నారు. ఢిల్లీ ఓటమిపై ఆమె స్పందిస్తూ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేరువేరు అంశాలపై జరుగుతాయని పురంధ్రీశ్వరి వ్యాఖ్యానించారు.