ఆంధ్రప్రదేశ్‌

జనసేన మినహా ఏ పార్టీతో పొత్తులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో జనసేనతో మినహా తమ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టంచేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేత వీర్రాజు చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈసందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ కార్యదర్శిపై ఐటీ దాడులను ప్రస్తావిస్తూ దాడుల్లో వెలుగుచూసిన షెల్ కంపెనీలు ఎవరివి, ఎవరు స్థాపించారన్న అంశాన్ని వెలికితీయాలన్నారు. ఏపీ మాయామశ్చీంద్రలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఐటీ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు ప్రత్యేక నిఘా ఉంచాయని, త్వరలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎవరైనా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను పాలకులు ఎంతో అభివృద్ధి చేశారని, రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ఆస్థాయి నగరం లేకుండా పోయిందన్నారు. ఈపరిస్థితి మరోసారి ఉత్పన్నం కాకూడదన్నదే తమ అభిమతమని, 13 జిల్లాలను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిపై ప్రత్యేక ప్రేమ కనపరిచారని, ఇప్పుడు జగన్ మూడు రాజధానులంటున్నారని సోము విమర్శించారు. ఆనాడు అమరావతిని, నేడు మూడు రాజధానులను ప్రజలెవరూ కోరుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధిచేసిన చంద్రబాబునాయుడు కుమారుడు అక్కడ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఈనెల 20న విజయవాడలో రాష్టస్థ్రాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రధాని నరేంద్రమోడీ విశేషంగా కృషిచేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి కుళాయి, రోడ్లు, స్వచ్చ్భారత్ కింద పారిశుద్ధ్యం, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఎల్‌ఈడీ దీపాలు, నిరంతర విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు, ఇళ్లు ఇలా అన్ని పథకాలు కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయన్నారు. అయితే గతంలో పాలించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు తామే అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్భాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. కోనసీమ రైల్వే నిర్మాణానికి ఇప్పటి వరకు 7-8వేల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు, అమలుచేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమావేశంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బిజెపి ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, నగర అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాజమహేంద్రవరం, ఏలూరు, కాకినాడ, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.